Vikram Solanki | అతడి క్రికెట్ నైపుణ్యం అద్భుతం.. గుజరాత్ భావి కెప్టెన్ తనే : టీమ్ డైరెక్టర్
Vikram Solanki: హార్దిక్ పాండ్యా తర్వాత గుజరాత్ టైటన్స్ కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్నకు టీమ్ డైరెక్టర్ విక్రం సోలం(Vikram Solanki)కి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) క్రికెట్ నైపుణ్యం అద్భుతమని, అతను గుజరాత్ భావి కెప్టెన్ అవుతాడని అతను తెలిపాడు.
Vikram Solanki: ఐపీఎల్(IPL) పదహారో సీజన్ మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్ (Gujarat Titans) ఈ సీజన్లో ఎలా ఆడనుంది అనేది ఆసక్తికరం. గత సీజన్లో హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) ఆ జట్టును అద్భుతంగా నడిపించాడు. అతని వారసుడు ఎవరు? అనే ప్రశ్నకు టీమ్ డైరెక్టర్ విక్రం సోలం(Vikram Solanki)కి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) క్రికెట్ నైపుణ్యం అద్భుతమని, అతను గుజరాత్ భావి కెప్టెన్ అవుతాడని అతను తెలిపాడు.
‘యంగ్‌స్టర్ శుభ్‌మన్ గిల్‌కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు ఆట గురించి చాలా తెలివిగా ఆలోచిస్తాడు. అంతేకాదు చాలా బాధ్యత తీసుకుంటాడు. గత ఏడాది అలవర్చుకున్నాడు’ అని సోలంకి తెలిపాడు. గత సీజన్లో గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా శుభారంభాలు ఇచ్చిన అతను 16 మ్యాచుల్లో 483 పరుగులు చేశాడు.
3 ఫార్మాట్లలో సెంచరీ..
శుభ్‌మన్ ప్రస్తుతం కెరీర్లోనే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లో శతకాల మోత మోగించాడు. టీ20ల్లో సెంచరీ, వన్డేల్లో కివీస్‌పై డబుల్ సెంచరీ కొట్టాడు. దాంతో, మూడు ఫార్మాట్లలో మూడంకెల స్కోర్ చేసిన తొమ్మిదో క్రికటర్‌గా, నాలుగో భారతీయుడిగా గుర్తింపు సాధించాడు. దాంతో, కేఎల్ రాహుల్‌ను పక్కకు పెట్టి మరీ గిల్‌కు ఆఖరి రెండు టెస్టుల్లో చోటు కల్పించారు. అహ్మదాబాద్‌లో జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో ఈ యంగ్‌స్టర్ సెంచరీ (116) బాది జట్టు భారీ స్కోర్‌కు పునాది వేశాడు.
నాలుగుసార్లు చాంపియన్‌తో..
పదహారో సీజన్ ఐపీఎల్ మార్చి 31న షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్, నాలుగుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొననుంది. ఆరంభ పోరులో గుజరాత్ విధ్వంసక బ్యాటర్ డేవిడ్ మిల్లర్ లేకుండానే బరిలోకి దిగనుంది. మ్యాచ్ రోజే అతను నెదర్లాండ్స్‌తో వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ కోసం వన్డే ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే అతను ఫ్రాంఛైజీకి తెలియజేశాడు.
ఇవి కూడా చదవండి
ICC | ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో టాప్ – 5 మ్యాచ్‌లు ఇవే : ఐసీసీ
NZ Awards | మిచెల్, అమేలియాకు న్యూజిలాండ్ క్రికెట్ ప్రతిష్ఠాత్మక అవార్డులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

