NZ Awards | మిచెల్, అమేలియాకు న్యూజిలాండ్ క్రికెట్ ప్రతిష్ఠాత్మక అవార్డులు
న్యూజిలాండ్ క్రికెట్(Newzealand Cricket) ఈ ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అటగాళ్లకు అవార్డులు ప్రకటించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్(Daryl Mitchell), మహిళా క్రికెటర్ అమేలియా కేర్ (Amelia Kerr) ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఎంపికయ్యారు.
NZ Awards : న్యూజిలాండ్ క్రికెట్(Newzealand Cricket) ఈ ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అటగాళ్లకు అవార్డులు ప్రకటించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్(Daryl Mitchell), మహిళా క్రికెటర్ అమేలియా కేర్ (Amelia Kerr) ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఎంపికయ్యారు. న్యూజిలాండ్ క్రికెట్లో అత్యుత్తమ అవార్డు అయిన ‘సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్’ ఈ ఏడాది మిచెల్‌ను వరించింది. మొదటిసారి ప్రవేశ పెట్టిన ‘డెబీ హాక్లీ మెడల్’ను అమేలియా అందుకుంది. భారత్‌పై వన్డే సిరీస్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌కు అవార్డు దక్కింది. అతను మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ మెడల్‌కు ఎంపికయ్యాడు.
ఆల్‌రౌండర్ మిచెల్ అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. టెస్టుల్లో గత ఏడాది ఆరంగేట్రం చేసిన అతను నాలుగు సెంచరీలు బాదాడు. నిలకడగా ఆడుతూ టెస్టు ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో నిలిచాడు. స్వదేశంలో శ్రీలంక, ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రాణించినందుకు అతడికి ‘రెడ్‌పాత్ కప్’ అవార్డు దక్కింది.
టీ20 మహిళా క్రికెటర్
బ్యాటుతో, బంతితో చెలరేగే అమేలియా టీ20 మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైంది. న్యూజిలాండ్ మహిళల జట్టులో ఆమె అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్. 112.20 స్ట్రైక్ రేటుతో 423 రన్స్ చేసింది. అంతేకాదు బంతితోనూ రాణించి 17 వికెట్లు కూల్చింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లోనూ అమేలియా అదరగొడుతోంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఆమె జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తోంది.
ఎవరికి.. ఏ అవార్డు?
సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్ : డారిల్ మిచెల్
డెబీ హాక్లే మెడల్ : అమేలియా కేర్
ఉమెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : సుజీ బేట్స్
మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : మైఖేల్ బ్రేస్‌వెల్
ఉమెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : అమేలియా కేర్
మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : గ్లెన్ ఫిలిఫ్స్
టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : టామ్ బ్లండెల్
ఉమెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్
ఇవి కూడా చదవండి
Rohit Sharma | అతను ఆడింది మూడు బంతులే.. సూర్యకుమార్ యాదవ్‌కు రోహిత్ శర్మ సపోర్ట్
IPL 2023 | పంబాబ్ కింగ్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు ఈసీబీ గ్రీన్ సిగ్నల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
Rashmika | విజయ్ను 100 కాదు.. 1000 సార్లు ప్రపోజ్ చేస్తా.. ట్రోలర్లకు రష్మిక గట్టి సమాధానం!
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

