GT vs CSK : లీగ్ దశ చివరి మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(50 నాటౌట్) అర్ద శతకంతో కదం తొక్కాడు. తొలి ఓవర్ నుంచి చెన్నై బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న గిల్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకన్నాడు. ఫ్రంట్‌ఫుట్ షాట్లతో అలరించిన గిల్.. మిడ్ వికెట్లో భారీ సిక్సర్ బాది ఈ సీజన్లో ఐదో ఫిఫ్టీ నమోదు చేశాడు. మరో ఎండ్‌లో సుదర్శన్ సైతం దూకుడుగా ఆడడంతో గుజరాత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 7 ఓవర్లకు స్కోర్.. 78.
చావోరేవో పోరులో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు తేలిపోతున్నారు. అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయలేక భారీగా పరుగులు సమర్పించుకున్నారు. తొలి ఓవర్లో ఒకటే ఫోర్ వచ్చినా.. స్పెన్సర్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్(50 నాటౌట్) రెండు ఫోర్లతో చెలరేగాడు. సాయి సుదర్శన్(22నాటౌట్) జతగా గిల్ ఎడాపెడా దంచేసి 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. వీరిద్దరి దూకుడుతో ఏడు ఓవర్లకు గుజరాత్ అజేయంగా 78 రన్స్ కొట్టింది.
𝙁𝙞𝙛𝙩𝙮 𝙞𝙣 𝙛𝙞𝙛𝙩𝙝 𝙜𝙚𝙖𝙧 for our Skipper ⚡ pic.twitter.com/Uh5MoX3Ww6
— Gujarat Titans (@gujarat_titans) May 21, 2026