Sarah Storey: సారా స్టోరేకు 15వ పారాఒలింపిక్ గోల్డ్ మెడల్

టోక్యో: పారాఒలింపిక్ అథ్లెట్ సారా స్టోరే ( Sarah Storey )చరిత్ర సృష్టించింది. పారాఒలింపిక్స్ కెరీర్లో 15వ గోల్డ్ మెడల్‌ను ఆమె సొంతం చేసుకున్నది. ఇవాళ ఇజు వెలోడ్రోమ్‌లో జరిగిన సైక్లింగ్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నది. టోక్యో పారాఒలింపిక్స్‌లో బ్రిటన్‌కు ఇది ఫస్ట్ గోల్డ్ మెడల్ కావడం విశేషం. C5 3,000m వ్యక్తిగత సైక్లింగ్ ఈవెంట్లో ఆమె వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. దీంతో 43 ఏళ్ల సారా స్టోరే ఖాతాలో మొత్తం 15 గోల్డ్ మెడల్స్ చేరాయి. గతంలో బ్రిటన్‌కు చెందిన మైక్ కెన్నీ 16 పసిడి పతకాలను గెలిచారు. స్టోరేకు పుట్టుకతోనే ఎడమ చేయి పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. 1992లో బార్సిలోనాలో జరిగిన పారాఒలింపిక్స్తో స్మిమ్మర్గా ఆమె కెరీర్ స్టార్ట్ అయ్యింది. నాలుగు పారాఒలింపిక్స్‌లో ఆమె ప్రాతినిధ్యం వహించింది. 2005 నుంచి ఆమె సైక్లింగ్ ఈవెంట్లో పోటీ చేస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

