Goal keeper Vozinha | స్పెయిన్‌ను వణికించి ఒక్క మ్యాచ్‌తో ఓవర్‌నైట్ స్టార్.. 24 గంటల్లో 60 లక్షల మంది ఫ్యాన్స్
Vozinha | 2026 ఫిఫా ప్రపంచకప్‌లో ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది.
Vozinha | 2026 ఫిఫా ప్రపంచకప్‌లో ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది. ప్రపంచ ఫుట్‌బాల్‌లోనే అత్యంత బలమైన జట్లలో ఒకటైన మాజీ ఛాంపియన్ స్పెయిన్‌ను, టోర్నీలోకి అనామక జట్టుగా అడుగుపెట్టిన చిన్న దేశం కేప్ వర్డే (Cabo Verde) 0-0 తో నిలువరించి అందరిని ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది. వరల్డ్ నెం 2 ర్యాంక్ ఉన్న దేశంతో మ్యాచ్ ఆడుతున్నాం అన్న భయం లేకుండా స్పానిష్ జట్టుకు చుక్కులు చూపించింది. అయితే ఈ చారిత్రాత్మక డ్రా వెనుక ఆ జట్టు 40 ఏళ్ల వెటరన్ గోల్ కీపర్ వోజిన్హా (జోసిమార్ జోస్ ఎవోరా డయాస్) చూపిన అసాధారణ పోరాటపటిమ ఉంది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు కేవలం 50 వేల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు మాత్రమే ఉన్న వోజిన్హా ఖాతాకు, మ్యాచ్ ముగిసిన 24 గంటల్లోనే ఏకంగా 6 మిలియన్ల (60 లక్షల) మంది కొత్త అభిమానులు వచ్చి చేరారంటే అతడు ఏ రేంజ్లో జట్టును ఆదుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. కేప్ వర్డే దేశ మొత్తం జనాభా సుమారు 5.3 లక్షలు మాత్రమే కాగా, ఆ దేశ జనాభా కంటే పది రెట్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుని అతను రాత్రికి రాత్రి గ్లోబల్ సోషల్ మీడియా స్టార్‌గా అవతరించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ ఏకంగా 27 సార్లు కేప్ వర్డే గోల్ పోస్ట్‌పై దాడులు చేసింది. అయితే ప్రపంచ స్థాయి స్టార్ ఆటగాళ్లు కొట్టిన ప్రమాదకరమైన షాట్లను వోజిన్హా గోడలా అడ్డుకున్నాడు. ముఖ్యంగా మ్యాచ్ చివరి నిమిషాల్లో ఫెర్రాన్ టోరెస్, ఐమెరిక్ లాపోర్టేలు చేసిన గోల్ ప్రయత్నాలను అతను ఒంటిచేత్తో తిప్పికొట్టిన తీరు అభిమానులను ఫిదా చేసింది. మొత్తం 8 అద్భుతమైన సేవ్స్‌తో స్పెయిన్‌కు చుక్కలు చూపించిన వోజిన్హా, ప్రపంచకప్ అరంగేట్రం మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా రికార్డు సృష్టించిన అత్యంత వృద్ధ గోల్ కీపర్‌గా చరిత్రకెక్కాడు. అతని ఈ అసమాన ప్రదర్శనకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
మరోవైపు మ్యాచ్ ముగిసిన వెంటనే వోజిన్హా మైదానంలోనే మోకాళ్లపై కూలబడి ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. తన కన్నీళ్ల వెనుక ఉన్న బాధను పంచుకుంటూ, తాను చిన్నప్పుడు తాతయ్య, అమ్మమ్మల వద్ద పెరిగానని, తన జీవితంలో సర్వస్వమైన వారు ఈ చారిత్రాత్మక క్షణాన్ని చూడటానికి ఇప్పుడు బతికి లేరని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా, అమెరికా కఠినమైన వీసా నిబంధనలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన తల్లి కూడా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి స్టేడియానికి రాలేకపోయిందని, తన జీవితకాల స్వప్నం నెరవేరిన వేళ వారు పక్కన లేకపోవడం బాధగా ఉన్నప్పటికీ, తన దేశానికి ఈ గౌరవం తెచ్చిపెట్టడం గర్వంగా ఉందంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
𝟓.𝟖 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍 𝐍𝐄𝐖 𝐅𝐎𝐋𝐋𝐎𝐖𝐄𝐑𝐒 🤯🌍
Before the World Cup, Vozinha had just 50K followers on Instagram. After his incredible masterclass against Spain, that number exploded to 𝟱.𝟴 𝗠𝗜𝗟𝗟𝗜𝗢𝗡 (!!!) 😳🇨🇻
Tim Payne had only 4,715 Instagram followers and was… pic.twitter.com/Qs6hvyCAtN
— 433 (@433) June 16, 2026
The Saviour Vozinha ♥️ pic.twitter.com/RaGDTm29et
— World Cup 2026 (@ofootball__) June 16, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

