వచ్చే ఐపీఎల్ సీజన్‌తో తన ప్రస్థానం ప్రారంభించనున్న లక్నో ఫ్రాంచైజీకి మెంటార్‌గా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడిన గంభీర్.. తమ జట్టుకు ముందు చరిత్ర సృష్టించే అవకాశం ఉందన్నాడు.
ఈ సీజన్లో తాము తమ సొంత విధానంతో పోరాడతామన్నాడు. ‘‘ఇంతకు ముందు ఎప్పుడూ ఊహించని చరిత్ర సృష్టించే అవకాశం ఇంది. మేం ఎవరినీ కాపీ కొట్టాలని అనుకోవడం లేదు. మా సొంత విధానాలను రూపొందించుకుంటాం. మాకు మా చరిత్ర ఉండాలి. భారం లేకుండా ప్రయాణం ప్రారంభించడాని కన్నా మంచి ఆరంభం ఏముంటుంది?’’ అని చెప్పాడు.
లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవో గోయెంకా మాట్లాడుతూ.. గతంలో ఐపీఎల్లో తన జట్టు పూణే సూపర్ జయంట్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయిందని చెప్పాడు. అదే విషయాన్ని గుర్తుచేసిన గంభీర్.. ఆ పని ఇప్పుడు చేయాల్సి ఉందని, అందుకే లాంగ్ టర్మ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెగా వేలంలో పాల్గొంటామని చెప్పాడు.