MI vs CSK : ఐపీఎల్ అభిమానులు ఆసక్తి కనబరిచే ఎల్ క్లాసికో పోరులో మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్(CSK)దే పైచేయి. వాంఖడేలో ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను చిత్తుగా ఓడించిన చెన్నై.. ఈసారి సొంతగడ్డపై పంజా విసిరింది. అన్షుల్ కంబోజ్(3-32) బంతితో విజృంభిచగా.. రుతురాజ్ గైక్వాడ్(67 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఇంప్యాక్ట్ సబ్ కార్తిక్ శర్మ(54 నాటౌట్)తో అర్ధ శతక భాగస్వామ్యం నెలకొల్పి ముంబైని ముంచాడు. ఈ సీజన్లో నాలుగో విజయంతో సీఎస్కే ఖాతాలో ఎనిమిది పాయింట్లు చేరాయి.
ఐపీఎల్-19లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో విజయంతో మురిసింది. చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ను 159కే కట్టడి చేసిన చెన్నై స్వల్ప లక్ష్యాన్ని ఊదిపడేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(67 నాటౌట్), ఇంప్యాక్ట్ సబ్ కార్తిక్ శర్మ(54 నాటౌట్)లు ముంబై బౌలింగ్ దళాన్ని సమర్ధంగా ఎదుర్కొని గెలుపు పునాది వేశారు. బౌండరీకి తరలించగా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది సీఎస్కే.
Impressive and Effective ✨
Maiden #TATAIPL Fifty for Kartik Sharma 👏👏
A crucial knock as he guides #CSK over the line 🫡
Updates ▶️ https://t.co/VVAjldiiC0#KhelBindaas | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/PDoawOdf9F
— IndianPremierLeague (@IPL) May 2, 2026
మోస్తరు ఛేదనలో బుమ్రా తన మొదటి ఓవర్లోనే డేంజరస్ సంజూ శాంసన్(11)ను బౌట్ చేసి తొలి వికెట్ అందించాడు. అనంతరం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(67 నాటౌట్) జతగా ఉర్విల్ పటేల్(26) చెలరేగాడు. 5వ ఓవర్లో 6, 4, 6తో 18 రన్స్ రాబట్టిన ఉర్విల్.. గజన్ఫర్ ఓవర్లో పెద్ద షాట్ ఆడబోగా బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్లకు తాకింది. పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసిన చెన్నైని గెలిపించే బాధ్యత తీసుకున్నారు గైక్వాడ్, ఇంప్యాక్ట్ సబ్ కార్తిక్ శర్మ(54 నాటౌట్).
Simply beautiful batting! 🤌
🎥 Ruturaj Gaikwad and Kartik Sharma making it look effortless during their brilliant partnership 🤝
Updates ▶️ https://t.co/VVAjldiiC0#TATAIPL | #KhelBindaas | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/uE5xhwvuZe
— IndianPremierLeague (@IPL) May 2, 2026
పాండ్యా ఓవర్లో మిడ్ వికెట్ దిశగా కొట్టిన సిక్సర్‌తో చెన్నై స్కోర్ వంద దాటింది. ముంబై బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా అర్ధ శతక భాగస్వామ్యంతో గెలుపు దిశగా నడిపారు. గజన్ఫర్ వేసిన ఓవర్లో కార్తిక్ 4, 6, 4తో 14 రన్స్ పిండుకున్నాడు. అదే ఊపులో బౌండరీతో చెన్నైకి ఎనిమిది వికెట్ల విజయాన్ని కట్టబెట్టాడు. తొమ్మిది మ్యాచుల్లో రెండింట మాత్రమే గెలిచిన ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించే పరిస్థితి తెచ్చుకుంది.
గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదారబాద్పై 243 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ చెపాక్‌లో తడబడింది. సొంత మైదానంలో సీఎస్కే పేసర్ అన్షుల్ కంబోజ్(3-32) విజృంభణకు ముంబై స్టార్లు తేలిపోగా.. నమన్ ధిర్(57) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ రికెల్టన్(37)తో.. ఆపై సూర్యకుమార్ యాదవ్(21)తో కీలక పరగుఉల జోడించి అర్ధ శతకంతో ముంబైని ఆదుకున్నాడు. ఆఖర్లో దంచేస్తాడనుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా(18) పెద్ద షాట్లు ఆడలేకపోయాడు. బోల్ట్ సిక్సర్‌తో ముంబై నిర్ణీత ఓవరల్లో 159 పరుగులే చేసింది.
నమన్ ధిర్(57)

Naman