బాక్సింగ్ నుంచి లిఫ్టింగ్ వైపు!
అప్పటికే స్నాచ్‌లో కామన్వెల్త్ గేమ్స్ రికార్డు బద్దలు కొట్టి.. అందరికంటే ముందు నిలిచిన జెరెమీ.. క్లీన్ అండ్ జర్క్‌లో గాయపడ్డ తర్వాత నొప్పితో విలవిలలాడాడు. కండరాలు పట్టేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిన లాల్రినుంగా.. బిగ్గరగా ఏడుస్తూ తన కోచ్ వైపు చూసి ‘మెడల్ ఆయా కీ నహీ’ అని ప్రశ్నించాడు. దీనికి అతడు మనం స్వర్ణం నెగ్గాం అనడంతో ఆనందంలో మునిగిపోయాడు.
నాలుగేండ్ల క్రితం 2018 యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గినప్పటి నుంచి జూనియర్ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న లాల్రినుంగా.. సీనియర్ స్టేజ్‌లో బరిలోకి దిగిన తొలి మెగాటోర్నీలోనే తన సత్తాచాటాడు. చిన్నప్పటి నుంచి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ బాక్సర్ కావాలనుకున్న జెరెమీ.. ఆ తర్వాత నిర్ణయం మార్చుకొని వెయిట్ లిఫ్టింగ్ వైపు అడుగులు వేశాడు.
అతడి తండ్రి లాల్నెత్లుంగా జూనియర్ స్థాయిలో జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. ఆ తర్వాత తండ్రి, కోచ్‌ల సూచన మేరకు బాక్సింగ్ వదిలి వెయిట్ లిఫ్టింగ్ వైపు మళ్లిన జెరెమీ.. 2016 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గాడు. తదుపరి ఏడాది కూడా అదే పతకాన్ని దక్కించుకున్న లాల్రినుంగా.. 2018 ఆసియా జూనియర్స్‌లో కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2018 యూత్ ఒలింపిక్స్‌లో చాంపియన్‌గా నిలువడంతో జెరెమీపై అంచనాలు పెరిగిపోయాయి.
ఒలింపిక్ పతకమే లక్ష్యంగా..
ప్రస్తుతం 67 కేజీల విభాగంలో పోటీపడుతున్న లాల్రినుంగా.. ఇకపై ఒలింపిక్ కేటగిరీలో 73 కేజీల విభాగంలో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ‘పారిస్ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడమే నా లక్ష్యం. అయితే అదంత సులువైన పనికాదు. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని జెరెమీ అన్నాడు.
వెయిట్ కెటగిరీని మార్చుకొని పోటీపడటం అంత ఈజీ కాదని అంటున్న లాల్రినుంగా.. దాని కోసం కఠోరంగా శ్రమిస్తానిని చెప్పాడు. చేతిపై ఒలింపిక్స్ రింగులను పచ్చబొట్టు పొడిపించుకున్న జెరెమీ.. తన తల్లి పుట్టిన రోజును కూడా చేతిపై ముద్రించుకున్నాడు. ఈ రెండు తనను ఎల్లప్పుడూ కార్యోన్ముఖుడిని చేస్తుంటాయంటున్న జెరెమీ.. తండ్రే తనకు అతిపెద్ద ఇన్స్పిరేషన్ అని పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

