చరిత్రలో ఈరోజు: తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం.. తొలి సెంచరీ బ్యానర్మన్దే..!
Today History: క్రికెట్లో తొలి టెస్ట్ మ్యాచ్ 1877 లో అంటే సరిగ్గా 145 ఏండ్ల క్రితం ఇదే రోజున ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మొదలైన ఈ మ్యాచ్.. ఆల్ ఇంగ్లండ్-కంబైన్డ్ న్యూ సౌత్ వేల్స్, విక్టోరియాల సంయుక్త జట్టు మధ్య కొనసాగింది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన బ్యానర్‌మన్.. ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఈ మ్యాచ్‌ను ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగినట్లుగా భావించారు.
తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు జేమ్స్ లిల్వైట్ కెప్టెన్‌గా వ్యవహరించగా, ఆస్ట్రేలియాకు డేవ్ గ్రెగొరీ కెప్టెన్‌గా ఉన్నారు. చార్లెస్ బానర్మన్ 165 పరుగుల ధాటికి ఆస్ట్రేలియా టాస్ గెలిచి 245 పరుగులు చేసింది. టెస్టు క్రికెట్లో సెంచరీ చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా బ్యానర్‌మన్ నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ 20 పరుగులకు మించి స్కోర్ చేయలేకపోయారు. అనంతరం ఇంగ్లండ్ జట్టు 196 పరుగులకే ఆలవుటైంది. ఇంగ్లండ్ తరఫున ఓపెనర్ హ్యారీ జుప్ 63, హ్యారీ చార్ల్‌వుడ్ 36, అలన్ హిల్ 35 పరుగులు చేశారు.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ పేలవంగా ఉండటంతో జట్టు 104 పరుగులకే కుప్పకూలింది. టామ్ హారన్ 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇంగ్లండ్ ముందు 154 పరుగుల విజయ లక్ష్యం ఉండగా, కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫలితం నాలుగో రోజే వచ్చింది. ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ సదరన్ టెస్టు క్రికెట్ ఆడిన అత్యంత వయోవృద్ధుడిగా నిలిచాడు. 49 ఏండ్ల 119 రోజుల వయసులో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు అలాగే ఉన్నది. ఇదే సమయంలో, టెస్ట్ మ్యాచ్‌లో మొదటి బంతిని ఆడిన ఆటగాడు, మొదటి టెస్ట్ సెంచరీ కూడా బ్యానర్‌మన్ పేరిటే ఉండటం విశేషం.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
ఇవాళ అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినం
- 2019: స్వీడిష్ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ ప్రారంభించిన ఫ్రైడే ఫర్ ది ఫ్యూచర్ కార్యక్రమంలో పాల్గొన్న లక్షన్నర మంది విద్యార్థులు
- 2011: సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభం
- 2009: భారతదేశపు మొదటి మహిళా పైలట్ సరళా థక్రాల్ మరణం
- 2008: ఇటలీలోని పోసిలియోలో మహాత్మా గాంధీ విగ్రహం స్థాపన
- 2001: అవినీతి ఆరోపణలపై రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన జార్జ్ ఫెర్నాండెజ్
- 1999: నార్వే మొదటి మహిళా రక్షణ మంత్రిగా నియమితులైన ఆల్డ్జోర్గ్ లోయర్
- 1985: మొదటి డొమైన్ పేరు ‘symbolic.com’ గా నమోదు
- 1934: బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జననం
- 1892: న్యూయార్క్‌లో తొలిసారి ఆటోమేటిక్ బ్యాలెట్ యంత్రాల ఉపయోగం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

