Federer | వీడ్కోలు తర్వాత ఫెదరర్ జీవితం పెద్దగా మారలేదు.. ఇప్పటికీ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు : మాజీ కోచ్
కెరీర్లో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఫెదరర్
Federer : టెన్నిస్ దిగ్గజాల్లో రోజర్ ఫెదరర్ ఎంత పాపులరో తెలిసిందే. పోయిన ఏడాది సెప్టెంటర్ ఈ స్విస్ ఆటగాడు టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. తన సొగసరి షాట్లతో అభిమానులను అలరించిన ఫెదరర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనే ఆసక్తి అందరిలో మొదలైంది. అయితే.. వీడ్కోలు తర్వాత కూడా ఫెదరర్ టెన్సిన్ సాధన చేస్తున్నాడని, అతడు ఉత్సాహంగా ఉన్నాడని మాజీ కోచ్ ఇవాన్ జిబికిక్ తెలిపాడు. టెన్నిస్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత ఫెదరర్ జీవితం పెద్దగా ఏమీ మారలేదు. అతను టెన్నిస్ కోర్టులో సరదాగా గడిపేందుకు ఇష్టపడతానే విషయం నాకు తెలుసు. ఎందుకంటే అక్కడే అతను హ్యాపీగా ఫీలవుతాడు అని జిబికిక్ వెల్లడించాడు. గతంలో వరల్డ్ నంబర్ 3 అయిన జిబికిక్ 2016 నుంచి 2022 వరకు ఫెదరర్‌కు కోచ్‌గా ఉన్నాడు.
కెరీర్లో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఫెదరర్ టెన్నిస్ గొప్ప ప్లేయర్లలో ఒకడు. వింబుల్డన్‌లో అత్యధికంగా 8 టైటిళ్లు సాధించాడు. ఆరు ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీలు, నాలుగు యూఎస్ ఓపెన్ టైటిళ్లు ఫెదరర్ ఖాతాలో ఉన్నాయి. రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్, ఆండీ ముర్రే వంటి ఆటగాళ్లను ఎదుర్కొంటూ వరల్డ్ నంబర్ 1 ర్యాంకులో కొనసాగాడు. వయసు పెరగడంతో పాటు యువ ఆటగాళ్లు దూసుకొస్తుండడంతో ఫెదరర్ సెప్టెంబర్‌లో ఆటకు వీడ్కోలు పలికాడు. 2022లో లావెర్ కప్‌లో ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఆటకు గుడ్ బై చెప్పిన తర్వాత అతను క్రీడాకారులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి గురించి మాట్లాడాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

