Zak Crawley | వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతానేమో.. హింట్ ఇచ్చిన ఇంగ్లండ్ ఓపెనర్
IPL - Zak Crawley : ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు ఉన్న క్రేజ్ తెలిసిందే. బోలెడు టీ20 లీగ్స్ ఉన్నా కూడా స్టార్ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. భారత అభిమానుల మనసు గెలవాలని ఆరాటపడుతారు. తాజాగా ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్(England Opener) జాక్ క్రాలే (Zak Crawley) కూడా ఐపీఎల్లో రాణించాలని ఉబలాటపడుతున్నాడు. సొంత గడ్డపై యాషెస్ సిరీస్(Ashes Series)లో దంచి కొట్టిన....
IPL – Zak Crawley : ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు ఉన్న క్రేజ్ తెలిసిందే. బోలెడు టీ20 లీగ్స్ ఉన్నా కూడా స్టార్ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. భారత అభిమానుల మనసు గెలవాలని ఆరాటపడుతారు. తాజాగా ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్(England Opener) జాక్ క్రాలే (Zak Crawley) కూడా ఐపీఎల్లో రాణించాలని ఉబలాటపడుతున్నాడు. సొంత గడ్డపై యాషెస్ సిరీస్(Ashes Series)లో దంచి కొట్టిన క్రాలే వచ్చే ఏడాది ఐపీఎల్ వేలం(IPL 2024 Auction)లో పేరు నమోదు చేసుకోనున్నాడు. అయితే.. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు.
‘ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్రాంచైజ్ టోర్నమెంట్. అత్యుత్తమ ఆట చూసేందుకు అదొక్కటే వేదిక. ఐపీఎల్లో మన సత్తాను నిరూపించుకునేందుకు అవకాశం ఉంటుంది. నిజంగా అదొక గొప్ప లీగ్. నేను మరిన్ని పరుగులు సాధిస్తే ఐపీఎల్లో ఆడే అవకాశం ఉంది. అప్పుడే నేను వేలంలో పేరు రిజిష్టర్ చేసుకుంటా. ఏదో ఒకరోజు నేను ఐపీఎల్ ఆడాలనుకుంటే లేదా నేను ఆ లీగ్‌లో ఆడాలని ఎవరైనా కోరుకుంటే కచ్చితంగా ఆడుతా’ అని క్రాలే వెల్లడించాడు. ఈ స్టార్ ఆటగాడికి బిగ్‌బాష్ లీగ్(Big Bash League)లో ఆడిన అనుభవం ఉంది. పైగా ఈమధ్య అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్నాడు.
మాంచెస్టర్ టెస్టులో సెంచరీ కొట్టిన జాక్ క్రాలే (189)

ఈమధ్యే ముగిసిన యాషెస్ సిరీస్‌లో క్రాలే కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్(Ben Duckett)తో కలిసి ఇంగ్లండ్‌కు శుభారంభాలు ఇచ్చాడు. సిరీస్‌లో ముఖ్యమైన మాంచెస్టర్ టెస్టు(Manchester Test)లో సెంచరీ(189)తో జట్టును పోటీలో నిలిపాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో 53.33 సగటుతో 480 పరుగులు సాధించాడు. దాంతో, ఆతిథ్య ఇంగ్లండ్ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోగలిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

