ఇంగ్లండ్‌కు భారీ షాక్.. క్రికెట్ నుంచి రాబిన్సన్ సస్పెండ్

లండన్: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌తోనే అరంగేట్రం చేసి అదరగొట్టిన పేస్ బౌలర్ ఓలీ రాబిన్సన్ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేశారు. ట్విటర్లో జాతి వివక్ష, మహిళల పట్ల వివక్షాపూరిత కామెంట్లు చేశాడంటూ అతనిపై చర్య తీసుకున్నారు. ఈ కేసు 2012-13కు సంబంధించినది. అప్పట్లో అతనో టీనేజర్. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. అది పూర్తయ్యే వరకూ రాబిన్సన్ అంతర్జాతీయ క్రికెట్లో ఆడే అవకాశం లేదని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆదివారం వెల్లడించింది. లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌తోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రాబిన్సన్.. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేశాడు.
అంతేకాదు తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన సమయంలో 42 పరుగులు చేసి ఇంగ్లండ్ పరువు నిలబెట్టాడు. అసలు మ్యాచ్ డ్రా కావడంతో అతనిదే కీలకపాత్ర. క్రికెట్ నుంచి సస్పెండ్ చేయడంతో న్యూజిలాండ్‌తో ఈ నెల 10 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌కు అతడు దూరం కానున్నాడు. ససెక్స్‌కు ఆడే రాబిన్సన్ వెంటనే ఇంగ్లండ్ టీమ్‌ను వీడి తన కౌంటీకి వెళ్లిపోనున్నాడని ఈసీబీ తెలిపింది. టీనేజర్‌గా ఉన్న సమయంలో ముస్లిం కమ్యూనిటీని ఉగ్రవాదానికి ముడిపెడుతూ ట్వీట్లు చేయడంతోపాటు మహిళలపై, ఆసియా ఖండ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తొలి రోజు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తర్వాత గత బుధవారం ఈ వ్యాఖ్యలపై అతడు క్షమాపణలు కూడా చెప్పాడు.
అలాంటి పోస్టులు చేసినందుకు తాను సిగ్గుపడుతున్నట్లు రాబిన్సన్ చెప్పాడు. తాను జాతి వ్యతిరేకిని కాదని అన్నాడు. అలాంటి ట్వీట్లు తాను ఊహించలేదని మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కూడా చెప్పాడు.
Statement: Ollie Robinson suspended from all international cricket
— England Cricket (@englandcricket) June 6, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

