Dwayne Bravo: బ్రావో అరుదైన ఘనత.. టీ20లలో తొలి బౌలర్‌గా చరిత్ర
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో చరిత్ర సృష్టించాడు. టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అతడు ఈ ఫార్మాట్లో మరే ఆటగాడికి సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. 38 ఏండ్ల బ్రావో.. టీ20లలో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ‘ది హండ్రెడ్ లీగ్’లో భాగంగా బ్రావో ఈ ఘనత అందుకున్నాడు.
ది హండ్రెడ్ లీగ్‌లో భాగంగా నార్తర్న్ సూపర్ఛార్జర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రావో.. ఓవల్ ఇన్విన్సిబుల్స్తో మ్యాచ్ ఆడుతూ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రిలీ రూసోను ఔట్ చేయడం ద్వారా బ్రావో.. పొట్టి ఫార్మాట్లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
వెస్టిండీస్ తరఫున 91 టీ20లు ఆడిన బ్రావో.. 78 వికెట్లు పడగొట్టాడు. మిగిలిన 522 వికెట్లు వివిధ దేశాలలో టీ20 లీగ్స్ ఆడి తీసినవే. ఇందులో భాగంగా ఐపీఎల్లో బ్రావో.. 161 మ్యాచ్‌లు ఆడి 183 మందిని ఔట్ చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో కలుపుకుని బ్రావో మొత్తంగా 545 మ్యాచ్‌లు ఆడాడు.
బ్రావో తర్వాత పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్) 466 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సునీల్ నరైన్ (460), ఇమ్రాన్ తాహిర్ (451), షకిబ్ అల్ హసన్ (418) లసిత్ మలింగ (390) ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

