ఢాకా: టాలీవుడ్ ఫిల్మ్ పుష్పలో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ డ్యాన్స్ మూవ్స్‌ను ఇప్పుడు క్రికెటర్లు ఇమిటేట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న విండీస్ ప్లేయర్ డ్వెయిన్ బ్రావో పుష్ప వాక్‌తో ఆకట్టుకున్నాడు. వికెట్ తీసిన తర్వాత శ్రీవల్లి పాటలో ఉన్న డ్యాన్స్ స్టెప్స్‌ను వేశాడు. ఫార్చూన్ బోరిషాల్ తరపున బ్రావో ప్రాతినిధ్యం వహించాడు. కొమిల్లా విక్టోరియా జట్టుపై అతను మూడు వికెట్లు తీశాడు. అయితే ఓ వికెట్ తీసిన తర్వాత అతను శ్రీవల్లి పాటలో ఉన్న స్టెప్పులే వేస్తూ ఎంజాయ్ చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో బ్రావో జట్టు గెలవలేదు. అయితే క్రికెటర్లు సురేశ్ రైనా, వార్నర్, కలీల్ ఇప్పటికే శ్రీవల్లి డ్యాన్స్‌ను తమ సోషల్ మీడియాలో పోస్టు చేసి పుష్ప క్రేజీని పెంచేస్తున్నారు.