విశ్వక్రీడలకు ద్యుతి

న్యూఢిల్లీ: భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. విశ్వక్రీడల 100, 200 మీటర్ల మహిళల పరుగులో పతకం కోసం పోటీపడనుంది. టోర్నీల్లో అర్హత మార్కును సాధించడంలో ద్యుతి కాస్తలో విఫలమైనా ర్యాంకింగ్స్ ఆధారంగా టోక్యో బెర్త్ దక్కించుకుంది. ప్రస్తుతం 100 మీటర్ల విభాగంలో 44వ, 200 మీటర్లలో 51వ ర్యాంకులో ఉన్న ఈ ఒడిశా చిరుత రెండు విభాగాల్లోనూ క్వాలిఫై అయింది. గతవారం ఇండియన్ గ్రాండ్ ప్రి-4లో 11.17 సెకన్లలో 100 మీటర్ల లక్ష్యాన్ని చేరిన ద్యుతికి కేవలం 0.02 సెకన్లలో తేడాతో ఒలింపిక్ క్వాలిఫికేషన్ చేజారింది. తెలంగాణకు చెందిన జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ దిశానిర్దేశంలో ముందుకు సాగుతున్న ద్యుతి.. చాలాకాలం పాటు హైదరాబాద్లోని సాయ్ గోపీచంద్ అకాడమీలోనూ శిక్షణ తీసుకుంది. మరోవైపు గాయంతో బాధపడుతున్న యువ సంచలనం హిమాదాస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. కాగా స్విమ్మర్ శ్రీహరి నటరాజన్ టోక్యో బెర్త్ దక్కించుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్లో ఓ రైతు ఆవేదన
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

