Tokyo Olympics: ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తొలి రోజు ఇండియాకు నిరాశే

టోక్యో: ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ ప్రారంభమైన తొలి రోజే ఇండియన్ అథ్లెట్లు నిరాశపరిచారు. మెన్స్ 3000 మీటర్ల స్టీపుల్ చేజ్, మెన్స్ 400 మీటర్ల హర్డిల్స్, వుమెన్స్ 100 మీటర్ల రేసుల్లో ఇండియన్ అథ్లెట్లు ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు.
ద్యుతీచంద్ ఫెయిల్
ఇండియా తరఫున ఎన్నో ఆశలు రేపిన స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ 100 మీటర్ల రేసులో విఫలమైంది. హీట్ 5లో పాల్గొన్న ఆమె 11.54 సెకన్లలో రేసు పూర్తి చేసి 7వ స్థానానికి పరిమితమైంది. ప్రతి హీట్‌లో టాప్ 3 మాత్రమే అర్హత సాధిస్తారు. ఈ హీట్‌లో వరల్డ్ సెకండ్ ఫాస్టెస్ట్ వుమన్, జమైకా స్ప్రింటర్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ 10.84 సెకన్లలో రేసు పూర్తి చేసి టాప్‌లో నిలిచింది.
నేషనల్ రికార్డు సాధించినా..
ఇక 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో ఇండియన్ అథ్లెట్ అవినాష్ ముకుంద్ నేషనల్ రికార్డు నమోదు చేసినా.. ఫైనల్‌కు మాత్రం క్వాలిఫై కాలేకపోయాడు. హీట్ 2లో పాల్గొన్న అతడు 8:18.12 నిమిషాలలో రేసు పూర్తి ఏడో స్థానానికి పరిమితమయ్యాడు.
జబీర్‌కు నిరాశే
ఇక 400 మీటర్ల హర్డిల్స్‌లో అయితే ఇండియన్ అథ్లెట్ మాదారి జబీర్ దారుణంగా విఫలమయ్యాడు. హీట్ 5లో పాల్గొన్న జబీర్.. చివరి స్థానంలో నిలిచాడు. ఈ రేసును అతడు 50.77 సెకన్లలో పూర్తి చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

