కోల్కతా: ప్రతిష్ఠాత్మక డ్యురాండ్ కప్లో ఈస్ట్బెంగాల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గత 1658 రోజులుగా విజయం కోసం వేచిచూసిన ఈస్ట్బెంగాల్కు ఎట్టకేలకు ఊరట లభించింది.
శనివారం జరిగిన మ్యాచ్లో ఈస్ట్బెంగాల్ 1-0తో మెహన్బగాన్పై అద్భుత విజయం సాధించింది. ఈ సీజన్లో మంచి ఫామ్మీదున్న నందకుమార్ శేఖర్ 60వ నిమిషంలో గోల్ చేశాడు.