మెల్బోర్న్: టెన్నిస్ స్టార్, వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ నోవాక్ జోకోవిచ్కు కోవిడ్ సంక్రమించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన తరపున వాదిస్తున్న లాయర్లు తమ డాక్యుమెంట్లో వెల్లడించారు. డిసెంబర్ 16వ తేదీన జోకోవిచ్కు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడేందుకు మెల్బోర్న్కు వెళ్లిన జోకోవిచ్ను.. డిటెన్షన్ సెంటర్లో పెట్టిన విషయం తెలిసిందే. కోవిడ్ వ్యాక్సిన్ మినహాయింపు పత్రంతో జోకోవిచ్ ఆస్ట్రేలియా చేరుకున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకోని జోకోకు ఎలా ఎంట్రీ కల్పించారని ఆ దేశ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అతన్ని ప్రస్తుతం మెల్బోర్న్లో ఉన్న డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. డిపోర్ట్ చేయవద్దు అంటూ జోకో తరపున లాయర్లు ఇవాళ కోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలో జోకోవిచ్కు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. డిసెంబర్ 16వ తేదీన నిర్వహించిన కోవిడ్ ఆర్టీ పీసీర్ పరీక్షలో జోకోవిచ్ పాజిటివ్ తేలినట్లు లాయర్లు తెలిపారు. అయితే డిపోర్టేషన్పై సోమవారం కోర్టు తీర్పును వెలువరించనున్నది.