Hotstar | భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన హాట్‌స్టార్.. ఆ మెగా టోర్నీ కూడా ఫ్రీయే..
Hotstar | గతేడాది డిస్నీ హాట్ స్టార్.. ఆసియా కప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్‌ను ఉచితంగా అందించింది. వన్డే వరల్డ్ కప్ సమయంలో ఎలాంటి రుసుము లేకుండా అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచింది. ఇప్పుడు అదే బాటలో మరో ఐసీసీ ట్రోఫీని...
Hotstar | భారత క్రికెట్ అభిమానులకు ప్రముఖ ఓటీటీ యాప్ డిస్నీ హాట్ స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వెస్టిండీస్ – అమెరికా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్ లైవ్ ప్రసారాలను భారత ప్రేక్షకులకు ఉచితంగా అందించనుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే పొట్టి ప్రపంచకప్ మొదలవనుందన్న విషయం తెలిసిందే. విండీస్ దీవులతో పాటు అమెరికాలో జరుగబోయే ఈ మెగా టోర్నీ జూన్ 2 నుంచి 29 వరకూ జరుగుతుందని ఐసీసీ ఇదివరకే ప్రకటించింది.
మెగా టోర్నీలను భారత క్రికెట్ అభిమానులకు ఉచితంగా అందించడం హాట్ స్టార్‌కు ఇదే కొత్తకాదు. గతేడాది ఆ సంస్థ.. ఆసియా కప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్‌ను ఉచితంగా అందించింది. వన్డే వరల్డ్ కప్ సమయంలో ఎలాంటి రుసుము లేకుండా అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచింది. ఇప్పుడు అదే బాటలో మరో ఐసీసీ ట్రోఫీని ఉచితంగా ప్రసారం చేయనుంది. అయితే ఈ ఫ్రీ సౌకర్యం కేవలం మొబైల్ యూజర్స్‌కు మాత్రమే.. స్మార్ట్ టీవీలు, ఆన్లైన్లలో ల్యాప్‌టాప్‌ల ద్వారా వీక్షించే వారు మాత్రం యథావిధిగా సంబంధిత రుసుము చెల్లించి మ్యాచ్‌లు చూడాలి.
HOTSTAR WILL STREAM T20I WORLD CUP 2024 FOR FREE ON MOBILE 🔥
– Great news for Cricket fans…..!!!! pic.twitter.com/qLBOeFMBb6
— Johns. (@CricCrazyJohns) March 5, 2024
డిస్నీ గత వారం రిలయన్స్‌తో జట్టుకట్టిన విషయం తెలిసిందే. భారత మీడియా రంగంలో సంచలనం సృష్టించిన ఈ విలీనం విలువ.. రూ. 70 వేల కోట్లు అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్‌లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

