IND vs SL : కొలంబో టెస్టులో విజయంతో డబ్ల్యూటీసీ(WTC 2025-27)లో ముందంజ వేయాలనుకున్న భారత జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ఐదో రోజూ సొనాల్ దినుష(133 నాటౌట్) ను ఔట్ చేయలేక మ్యాచ్‌ను డ్రాగా ముగిసింది టీమిండియా. రెండు సెషన్లలోనూ రవీంద్ర జడేజా(3-94)కు సహకరించే బౌలర్ కరువవ్వగా .. రికార్డు శతకాలు బాదేసిన దినుష లంకను ఓటమి నుంచి తప్పించాడు. దాంతో, 1-0తో శుభ్‌మన్ గిల్ సేన సిరీస్‌ను గెలుచుకుంది.
తొలి రెండు రోజులు కొలంబోలో పైచేయి టీమిండియాదే. మూడోరోజు కూడా బౌలర్లు చెలరేగడంతో భారత్ గెలుపు నల్లేరుమీద నడకే అనుకున్నారంతా. కానీ, అందరిఅంచనా తప్పంది. శ్రీలంక ఆట మారింది. ఫలితంగా.. ఫాలో ఆన్ గండం దాటలేక.. ఓటమి అంచున నిలిచిన శ్రీలంక సొనాల్ దినుష(103, 133 నాటౌట్) వరస శతకాలతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.
The stars just made room
Sonal Dinusha 🌟 pic.twitter.com/YWBnL9YRqB
— Cricinfo (@cricinfo) August 27, 2026
గాలే టెస్టులో చిత్తుగా ఓడిన శ్రీలంక కొలంబోలో గొప్పగా ఆడింది. టాపార్డర్ విఫలమైనా.. పసిందు సూర్యబండార(92), సొనాల్ దినుష(133 నాటౌట్ : 264 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు )లు అసమాన పోరాటంతో ఓటమిని తప్పించారు. తొలి ఇన్నింగ్స్‌లో శతకం(103)తో మెరిసిన దినుష.. ఐదో రోజూ ఏకంగా గోడ కట్టాడు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన అతడు నువాంత(46), లహిరు కుమార(12)లతో విలువైన భాగస్వామ్యాలతో లంక ఆధిక్యాన్నిపెంచుతూ పోయాడు.
Sonal Dinusha is Sri Lanka’s hero as the teams shake hands in Colombo 🤝 pic.twitter.com/tqCvjKWB2W
— Cricinfo (@cricinfo) August 27, 2026
క్రీజులో పాతుకుపోయిన దినుష భారత స్పిన్నర్లు, పేసర్లకు వెరవలేదు. నింపాదిగా ఆడుతూ తన జట్టును గట్టెక్కించడమే లక్ష్యంగా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడతడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ సంకల్పంతో టీ బ్రేక్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 383 రన్స్ కొట్టిన ఆతిథ్య జట్టుకు డ్రాపై ఆశలు చిగురించాయి. కాసేపటికే సింగిల్‌తో శతకం అందుకున్న దినుష.. ఆపై సిక్సర్లతో చెలరేగాడు.
Sri Lanka’s resilience with the bat ensures that only three wickets fall on the final day. The two teams shake hands after a hard-fought Test, which ends in a draw.#TeamIndia win the series 1-0.
Details – https://t.co/Uh4Xgn8rB5 pic.twitter.com/spxoqmBzct
— BCCI (@BCCI) August 27, 2026
చివరి బ్యాటర్ అసితా ఫెర్నాండో సైతం పట్టుదలగా ఆడగా.. మ్యాచ్ గెలిచే పరిస్థితులు లేవని టీమిండియాకు అర్ధమైంది. కాసేపటికే లంక 429/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆట ముగిసేందుకు మరో 17 ఓవర్లు ఉన్నప్పటికీ.. ఫలితం తేలే అవకాశాలు కనిపించనందున ఇరుజట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని డ్రాకు అంగీకరించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3-94) ఒక్కడే మూడు వికెట్లతో రాణించాడు. దేవ్‌దత్ పడిక్కల్(117), ధ్రువ్ జురెల్(115) శతకాలతో తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా 503/9 వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
Batters to score twin hundreds in Tests where their teams followed-on:
Vijay Hazare (IND) vs AUS, Adelaide, 1948
Andy Flower (ZIM) vs SA, Harare, 2001
Sonal Dinusha (SL) vs IND, Colombo (SSC), 2026 pic.twitter.com/iSO0uryyUk— Cricinfo (@cricinfo) August 27, 2026