Shikhar Dhawan | నా బయోపిక్‌లో వాళ్లు నటిస్తే సంతోషిస్తా.. ఎందుకంటే..?
Shikhar Dhawan : ఆటకు గుడ్ బై చెప్పిన ధావన్ తన బయోపిక్ (Biopic)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన జీవితాన్ని చక్కని సినిమాగా తెరకెక్కిస్తే చాలా సంతోషిస్తానని అన్నాడు.
Shikhar Dhawan : భారత జట్టు విధ్వంసక ఓపెనర్లలో ఒకడైన శిఖర్ ధావన్ (Shikhar Dhawan) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రెండేండ్లుగా జట్టులో స్థానం దక్కకపోవడంతో ధావన్ శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఏకకాలంలో అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు గబ్బర్ అల్విదా చెప్పాడు. ఆటకు గుడ్ బై చెప్పిన ధావన్ తన బయోపిక్ (Biopic)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన జీవితాన్ని చక్కని సినిమాగా తెరకెక్కిస్తే చాలా సంతోషిస్తానని అన్నాడు.
ఒకవేళ బయోపిక్‌లో అవసరమైతే నేను నటించేందుకు సిద్ధమే. అలాకాకుంటే బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్(Akshay Kumar) లేదా రణ్వీర్ సింగ్(Ranveer Singh)లలో ఎవరో ఒకరు నటిస్తే బాగుంటుంది అని ధావన్ వెల్లడించాడు. ‘నా జీవిత కథలో అక్షయ్ కుమార్ నటిస్తే నేను ఆనందిస్తా. ఒకవేళ రణ్వీర్ సింగ్ అయినా పర్లేదు. ఎందుకంటే అతడి ఎనర్జీ మామూలుగా ఉండదు’ అని ధావన్ తెలిపాడు.

అంతేకాదు వీడ్కోలు తర్వాత తన పాపులారిటీ తగ్గుందని అనుకోవడం లేదని ధావన్ చెప్పాడు. ‘రిటైర్మెంట్ అనంతరం నాకు ఫాలోయింగ్ తగ్గుతుందని ఎవరు చెప్పారు? ఏమో ఎవరికి తెలుసు నా పాపులారిటీ మరింత పెరగొచ్చు. నేను అభిమానుల గుండెల్లో ఉన్నాను. కొన్నిసార్లు క్రికెట్ ద్వారా మరికొన్ని సార్లు నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఫ్యాన్స్ మదిలో స్థానం సంపాదించా. అందుకని జనాలు నాపై చూపించే ప్రేమ ఇకపై పెరుగుతుందని భావిస్తున్నా’ అని ధావన్ చెప్పుకొచ్చాడు.
వన్డేల్లో 17 శతకాలు
రంజీల్లో అదరగొట్టి 2010లో టీమిండియా జెర్సీ వేసుకున్న ధావన్ ఓపెనర్‌గా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ విధ్వంసక బ్యాటర్ టెస్టుల్లో 7 సెంచరీలు, వన్డేల్లో 17 శతకాలు బాదాడు. పొట్టి ఫార్మాట్లో 1,759 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్లో ఎన్నో ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లు ఆడిన ధావన్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ సారథిగా ఉన్నాడు.

మైదానంలో తన సూపర్ ఆటతో అదరగొట్టిన ధావన్ వైవాహిక జీవితంలో మాత్రం ఫ్లాప్ అయ్యాడు. అతడు అయేషాను 2012 అక్టోబర్‌లో పెండ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు మొదటి భర్తతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2021లో అయేషా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధావన్‌తో విడాకుల విషయాన్ని వెల్లడించింది. ఈమధ్యే ఫ్యామిలీ కోర్టు ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం అయేషా ఆస్ట్రేలియాలో ఉంటోంది. జొరావర్ కూడా ఆమెతో పాటు అక్కడే ఉంటున్నాడు.
ఇవి కూడా చదవండి
TG Rains | తెలంగాణ 14 జిల్లాల్లో భారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ
Shikhar Dhawan | ఫన్నీ ధావన్ ‘గబ్బర్’ అయ్యాడిలా..?
Tirumala hundi gifts | ఈ నెల 28న శ్రీవారి కానుకలు వేలం.. ఏమేం ఉన్నాయంటే..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

