CSK | చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్‌కు న్యూజిలాండ్ క్రికెటర్ కాన్వె దూరం!
ఐపీఎల్ మొదలుకాకముందే డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. చేతి వేలి గాయం కారణంగా న్యూజిలాండ్ క్రికెటర్ డేవాన్ కాన్వె రానున్న ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
CSK | వెల్లింగ్టన్: ఐపీఎల్ మొదలుకాకముందే డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. చేతి వేలి గాయం కారణంగా న్యూజిలాండ్ క్రికెటర్ డేవాన్ కాన్వె రానున్న ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా కాన్వె గాయపడ్డాడు. దీంతో సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌తో పాటు ఆసీస్‌తో తొలి టెస్టుకు దూరమయ్యాడు. పూర్తిగా కోలుకునేందుకు ఎనిమిది వారాల సమయం పట్టే అవకాశముందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
కాన్వె ఎడమచేతి బ్రొటన వేలుకు గాయమైంది. ఈ వారంలో అతని వేలికి శస్త్రచికిత్స జరుగుతుంది. ఎనిమిది వారాల వ్యవధిలో అతను పూర్తిగా కోలుకునే అవకాశముంది’ అని న్యూజిలాండ్ చీఫ్ కోచ్ గ్యారీ స్టెడ్ మీడియా ముఖంగా పేర్కొన్నాడు. 2022లో కాన్వెను చెన్నై కనీస ధర కోటి రూపాయలకు తీసుకుంది. ఇప్పటి వరకు చెన్నై తరపున 23 మ్యాచ్‌లాడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్ 46 సగటుతో 924 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే కాన్వె గాయంపై చెన్నై ఫ్రాంచై జీ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

