IPL 2023: గెలుపు ఎవరిది.. ఢిల్లీ ఓడితే లీగ్ నుంచి ఔట్
ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే లీగ్ నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయిన మొదటి టీం ఢిల్లీ అవుతుంది. ఫామ్ అందుకున్న వార్నర్‌ను అడ్డుకోవాలంటే పంజాబ్ బౌలర్లు కష్టపడాల్సిందే. అర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అతడిని ఔట్ చేయలేకపోయారు.
IPL 2023: ఐపీఎల్లో ఢిల్లీ తన సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే లీగ్ నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయిన మొదటి టీం ఢిల్లీ అవుతుంది. మరోవైపు పంజాబ్ ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతోంది. గత రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో ఈ రోజు మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది.
అరుణ్ జైట్లీ స్టేడియం స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉంది. అంతేకాకుండా మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. 2020 నుంచి ఈ రెండు జట్లు 6సార్లు తలపడగా ఢిల్లీ 5 సార్లు గెలిచింది. పంజాబ్ బ్యాటర్లు ఫామ్‌లో ఉండటం వారికి కలిసొచ్చే అంశం.
పంజాబ్ బ్యాటర్ లివింగ్‌స్టోన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మ్యాచ్‌ను ఒంటిచేత్తో తిప్పేయగల సత్తా అతడి సొంతం. అయితే అతడికి ఢిల్లీ స్పిన్నర్ల నుంచి ముప్పు పొంచి ఉంది. మరోవైపు అక్షర్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో రాణిస్తున్నాడు. ఫామ్ అందుకున్న వార్నర్‌ను అడ్డుకోవాలంటే పంజాబ్ బౌలర్లు కష్టపడాల్సిందే. అర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అతడిని ఔట్ చేయలేకపోయారు. అంతేకాకుండా వార్నర్‌కు రబాడా బౌలింగ్‌లో మంచి రికార్డు ఉంది. 2015 నుంచి 2020వరకు డేవిడ్ వార్నర్ పంజాబ్‌పై వరసగా 9సార్లు 50కిపైగా రన్స్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold Smuggling | పసిడికి సుంకాల సెగ.. దేశంలో భారీగా పెరిగిన బంగారం స్మగ్లింగ్!
IND vs NZ ODI | టాస్ గెలిచిన భారత్.. కివీస్‌కు బ్యాటింగ్.. టీమిండియా తుది జట్టు ఇదే!
SIR | ఆధార్‌కు బదులు ఓటర్ ఐడీ.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సర్ ఎసరు?
Walking | ట్రెడ్‌మిల్‌పై నడవడమా? పార్కుల్లో వాకింగా? ఏది బెటర్?
IND vs NZ ODI | భారత్-కివీస్ తొలి వన్డేకు వరుణుడి బ్రేక్.. వర్షంతో ఆలస్యమైన టాస్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

