స్టట్గార్ట్ : పోర్షె గ్రాండ్ ప్రి టెన్నిస్ టోర్నీని డిఫెండింగ్ చాంపియన్ ఇగా సియాటెక్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సియాటెక్ 6-3, 6-4 స్కోరుతో అరినా సబలెంకపై గెలిచి టైటిల్ను కైవసం చేసుకుంది.
గత యేడాదికూడా సియాటెక్ సబలెలంకపైనే గెలిచి టైటిల్ దక్కించుకుంది. వీరువురూ ముఖాముఖి ఏడుసార్లు తలపడగా సియాటెక్ అయిదుసార్లు గెలిచి ఆధిపత్యం ప్రదర్శించింది.