Mexican Open | చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా టీనేజర్.. వరుసగా రెండో ట్రోఫీ అతడిదే
Mexican Open : ఆస్ట్రేలియా టీనేజర్ అలెక్స్ డి మినౌర్( Alex De Minaur) మెక్సికన్ ఓపెన్ (Mexican Open 2024)లో చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీ విజేతగా నిలిచాడు. దాంతో, 2012 తర్వాత మెక్సికన్ ఓపెన్ ట్రోఫీని నిలబెట్టుకున్న...
Mexican Open : ఆస్ట్రేలియా టీనేజర్ అలెక్స్ డి మినౌర్( Alex De Minaur) మెక్సికన్ ఓపెన్ (Mexican Open 2024)లో చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీ విజేతగా నిలిచాడు. దాంతో, 2012 తర్వాత మెక్సికన్ ఓపెన్ ట్రోఫీని నిలబెట్టుకున్న తొలి ఆటగాడిగా మినౌర్ రికార్డు నెలకొల్పాడు. మెక్సికోలోని అకాపుల్కోలో ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ ఆటగాడైన మినౌర్ తన తడాఖా చూపించాడు. వరుస సెట్లలో ఆధిపత్యం చెలాయించిన ఆసీస్ కుర్రాడు.. కాస్పెర్ రూడ్‌పై 6-4, 6-4తో విజయం సాధించాడు.
దాంతో, మెక్సికన్ ట్రోఫీని రెండు సార్లు ముద్దాడిన నాలుగో ఆటగాడిగా మినౌర్ రికార్డుల్లోకెక్కాడు. ‘అకాపుల్కో నాకు రెండో ఇల్లుతో సమానం. నిరుడు నా ప్రదర్శనతో నిరాశకు గురయ్యా. అయితే.. ఏడాది తర్వాత మళ్లీ ఇక్కడకు వచ్చి టైటిల్ నిలబెట్టుకున్నా. ఇది నిజంగా గొప్ప ఫీలింగ్’ అని మినౌర్ తెలిపాడు.
.@alexdeminaur y el punto del campeonato. 🔥#AMT2024 #CelebratingTennis pic.twitter.com/gFcGPo0Ak3
— Abierto Mexicano (@AbiertoTelcel) March 3, 2024
నిరుడు భారీ సుడిగాలి మెక్సికో సిటీని అతలాకుతలం చేసింది. ఆ నగరంలో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఏకంగా 52 మంది ప్రాణాలు కోల్పయారు. దాంతో, నిర్వాహకులు మెక్సికన్ ఓపెన్‌ను రద్దు చేశారు. కానీ, తమ ప్రజల ముఖాల్లో సంతోషం చూసేందుకు టోర్నీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. చివరకు వాళ్లు అనుకున్నట్టుగానే టోర్నీ బాగా సక్సెస్ అయింది. ఫైనల్లో ఓడిన కాస్పర్ రూడ్ తొలి ఏటీపీ 500 టైటిల్‌ను మిస్ అయ్యాడు.
ఇవి కూడా చదవండి
- Clever Elephant | ఏనుగు తెలివి చూశారా.. తీగల్లో కరెంటు లేదని ఈజీగా కనిపెట్టేసింది..Viral video
- Viral Video | ఆకట్టుకుంటున్న రెయిన్బో పానీపూరి స్టాల్..ఎక్కడంటే..!
- Bill Gates | డాలీ ఛాయ్‌వాలా టీస్టాల్లో బిల్ గేట్స్ ఛాయ్ పే చర్చ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

