David Warner : భారత సిరీస్ చివరి రెండు టెస్టులకు దూరమైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి ట్రెండ్ అవుతున్నాడు. తెలుగు, తమిళం, బాలీవుడ్ సినిమా పాటలకు డాన్స్ చేసి అలరించే అతను ఈసారి మల్లయోధుడిగా (రెజ్లర్) అవతారం ఎత్తాడు. వీడియో ముఖాన్ని మార్ఫ్ చేసి, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అలాగని ఏదో సరదా కోసం అతను ఈ పని చేయలేదు. ఈ మార్ఫింగ్ వీడియోను తమిళ దర్శుకుడికి అంకితం చేస్తున్నట్టు తెలిపాడు. తమిళంలో పాపులర్ దర్శకుడు ఎస్.శంకర్ తెరకెక్కించిన ఐ సినిమాలోని విక్రమ్ పాత్రను ఇమిటేట్ చేశాడు. దానికి ‘ఇది నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటి. ఈ మూవీ పేరు చెప్పుకోండి?’ అని క్యాప్షన్ రాశాడు.
ఐ సినిమాలోని ఫైట్ సీన్ వీడియోను వార్నర్ మార్ఫింగ్ చేశాడు. విక్రమ్ ముఖం బదులు తన ముఖ కనిపించేలా చేసి, ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది.. అభిమానులు వార్నర్ నువ్వు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే నాలుగు లక్షల మందికి పైగా ఈ వీడియో చూశారు. లాక్డౌన్ సమమంలోనూ వార్నర్ మార్ఫింగ్ వీడియోలు, డాన్స్ వీడియోలతో అభిమానులతో టచ్‌లో ఉన్నాడు. ఈ ఎడమ చేతివాటం ఓపెనర్ తన దూకుడైన ఆటతో ఎంత పేరు తెచ్చుకున్నాడో, మార్ఫింగ్ వీడియోలతో కూడా అంతే పేరు తెచ్చుకున్నాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ నుంచి డేవిడ్ వార్నర్ అర్థాంతరంగా తప్పుకున్నాడు. మోచేతికి గాయం కారణంగా చివరి రెండె టెస్టులకు దూరం అయ్యాడు. అంతేకాదు ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో ఈ ఆసీస్ ఓపెనర్ కంకషన్తో మైదానం వీడాడు. దాంతో అతని ప్లేస్‌లో ట్రావిస్ హెడ్ జట్టులోకి వచ్చాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో దుమ్మురేపిన వార్నర్ భారత్‌తో తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలం అయ్యాడు. అయితే.. ‘2024 వరకు ఆడతానని నేను ఎప్పుడూ చెప్తున్నా. ఒకవేళ సెలెక్టర్లు నన్ను టెస్టు జట్టుకు ఎంపిక చేయకున్నా సరే నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడతాను. మరో 12 నెలల సమయం ఎంతో క్రికెట్ ఉంది. నేను నిలకడగా పరుగులు సాధిస్తే మళ్లీ జట్టులోకి వస్తాను’ అని ఈ డాషింగ్ ఓపెనర్ అన్నాడు. . మైదానంలోనే కాదు, బయట కూడా చలాకీగా ఉండే వార్నర్ తొందరగా ఎల్బో గాయం నుంచి కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.