హైదరాబాద్, ఆట ప్రతినిధి : టీ9 చాలెంజ్ నాలుగో సీజన్ గోల్ఫ్ టోర్నమెంట్ హైదరాబాద్ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్లో రసవత్తరంగా సాగుతోంది. సోమవారం రెండో రౌండ్ పోటీలు ముగిసేసరికి పూల్-ఏలో బంకర్ బస్టర్స్, పార్ టైమర్స్ జట్లు చెరో 5.5 పాయింట్లతో నిలిచాయి.
మెరుగైన విన్ రికార్డ్ ఆధారంగా బంకర్ బస్టర్స్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. రెండో రోజు అద్భుతంగా ఆడిన దాసోస్ బై మహి జట్టు 3.5 పాయింట్లు సాధించింది. మొత్తం 4.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి నాకౌట్ రేసులోకి వచ్చింది. పూల్-బీలో ఆర్డీ ఐరన్ ఈగల్స్ (5) టాప్లో ఉంది.