ఇస్లామాబాద్: పాకిస్థాన్ సూపర్ లీగ్( Pakistan Super League)లో మరో వివాదం చోటుచేసుకున్నది. క్వెట్టా గ్లేడియర్స్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్‌కు వ్యతిరేకిస్తూ.. రావాల్పిండి బ్యాటర్ డారెల్ మిచ్చెల్ క్రీజ్ నుంచి పక్కకు వెళ్లాడు. తారిక్ బౌలింగ్‌లో ఆడేందుకు మిచ్చెల్ అయిష్టత ప్రదర్శించాడు. రావాల్పిండి చేజింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బౌలర్ తారిక్ యాక్షన్‌పై గతంలోనూ కొందరు బ్యాటర్లు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బౌలింగ్ చేసే క్రమంలో అతను క్రీజ్ వద్దకు వచ్చిన తర్వాత కాసేపు ఆగి ఆ తర్వాత బంతిని డెలివరీ చేస్తాడు. ఆ యాక్షన్ వల్ల కొందరు బ్యాటర్లు అతన్ని ఆడేందుకు ఇబ్బందిపడుతున్నారు.
ఇక న్యూజిలాండ్ బ్యాటర్ డారెల్ మిచ్చెల్ కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆ ఇబ్బంది ఎదుర్కొన్నాడు. తారిక్ వేసిన ఓ బంతిని ప్యాడిల్ స్వీప్ చేసిన మిచ్చెల్.. ఆ తర్వాత బంతి వేసే సమయంలో క్రీజ్ పక్కకు వెళ్లాడు. ఆ తర్వాత కూడా మరో బంతికి మిచెల్ అలాగే పక్కకు జరిగాడు. తారిక్ యాక్షన్ సరిగా లేదన్నట్లు మిచ్చెల్ అసహనం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో అంపైర్ జోక్యం చేసుకుని బ్యాటర్‌తో మాట్లాడాడు. కానీ సౌద్ షకీల్ బౌలింగ్‌లో మిచ్చెల్ ఔటయ్యాడు. 61 రన్స్ తేడాతో రావల్పిండి జట్టు ఓటమిపాలైంది.
Daryl Mitchell refuses to face Usman Tariq 😂 #QTGVRWP pic.twitter.com/2CO6z4NvR9
— Nibraz Ramzan (@nibraz88cricket) April 10, 2026