SA vs ENG | హెండ్రిక్స్ దూకుడు.. క్లాసెన్ ఊచకోత.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం నిలిపిన సఫారీలు
SA vs ENG | రెండు అగ్రశ్రేణి జట్లు అయిన ఇంగ్లండ్ - దక్షిణాఫ్రికా మధ్య ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరుగుతున్న 20వ లీగ్ మ్యాచ్‌లో సఫారీలు వీరబాదుడు బాదారు.
SA vs ENG | రెండు అగ్రశ్రేణి జట్లు అయిన ఇంగ్లండ్ – దక్షిణాఫ్రికా మధ్య ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరుగుతున్న 20వ లీగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు.. ఇంగ్లండ్ ఎదుట భారీ లక్ష్యాన్ని నిలిపారు. రీజా హెండ్రిక్స్ (75 బంతుల్లో 85, 9 ఫోర్లు, 3 సిక్సర్లు)కు తోడు రస్సీ వాన్ డెర్ డసెన్ (61 బంతుల్లో 60, 8 ఫోర్లు) నిలకడకు తోడు ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్ (67 బంతుల్లో 109, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారం చేసి శతకం బాదాడు. మార్కో జాన్సెన్ (42 బంతుల్లో 75 నాటౌట్, 3 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. తొలి ఓవర్లో రెండో బంతికి క్వింటన్ డికాక్ వికెట్ తీసి సఫారీలకు షాకిచ్చినా ఆ తర్వాత వికెట్ల కోసం 19 ఓవర్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. హెండ్రిక్స్, డసెన్‌లు రెండో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ అర్థ సెంచరీలు పూర్తిచేసుకుని దక్షిణాఫ్రికా మెరుగైన స్కోరు సాధించేందుకు మెరుగైన పునాది వేశారు. ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్ పేసర్లు రీస్ టాప్లీ, డేవిడ్ విల్లే, జో రూట్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్ లను మార్చి మార్చి ప్రయోగించినా ఫలితం లేకపోయింది. సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని ఎట్టకేలకు అదిల్ రషీద్ విడదీశాడు. రషీద్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతికి డసెన్.. బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
తాత్కాలిక సారథి ఎయిడెన్ మార్క్రమ్ తో జట్టుకట్టిన హెండ్రిక్స్.. అతడితో కూడా మూడో వికెట్ కు 39 పరుగులు జోడించిన తర్వాత రషీద్ సఫారీలకు మరో షాకిచ్చాడు. 25వ ఓవర్ రెండో బంతికి రషీద్.. హెండ్రిక్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.హెండ్రిక్స్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసెన్‌తో కలిసి మార్క్రమ్.. క్లాసెన్‌తో కలిసి సఫారీ స్కోరుబోర్డును నడిపించాడు. ఈ ఇరువురూ నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. 35 ఓవర్లో సఫారీ సారథిని టాప్లీ బోల్తా కొట్టించాడు. డేవిడ్ మిల్లర్ (5) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు.
కసిగా బాదిన క్లాసెన్..
మార్క్రమ్ నిష్క్రమించాక మార్కో జాన్సెన్ తో కలిసి క్లాసెన్ రెచ్చిపోయాడు. ఆఖరి ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టాప్లీ వేసిన 41వ ఓవర్లో రెండు బౌండరీలు బాదిన క్లాసెన్.. అతడే వేసిన 43వ ఓవర్లో రెండు బౌండరీలు ఓ భారీ సిక్సర్ బాది సఫారీ స్కోరుబోర్డును 300 మార్కు దాటించాడు. 40 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన క్లాసెన్.. తర్వాత యాభై పరుగులు చేయడానికి కేవలం 21 బంతులు మాత్రమే తీసుకోవడం గమనార్హం. 61 బంతుల్లోనే క్లాసెస్ శతకం బాదాడు. సిక్సర్లు, ఫోర్లతో కసిగా బాదిన క్లాసెన్.. ఆఖర్లో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరి మూడు ఓవర్లలో అయితే బంతి బౌలర్ల చేతిలో కంటే బౌండరీ లైన్ ఆవలే ఎక్కువగా ఉంది. గస్ అట్కిన్సన్ వేసిన 48వ ఓవర్లో జాన్సేన్ రెండు సిక్సర్లు ఓ ఫోర్ బాది 35 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేశాడు. ఇక టాప్లీ వేసిన 49వ ఓవర్లో జాన్సెన్ మూడు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆరో వికెట్ కు ఈ ఇద్దరూ ఏకంగా 138 పరుగులు జోడించారు. చివరి పది ఓవర్లలో సఫారీలు ఏకంగా 143 పరుగులు పిండుకున్నారంటే వాళ్ల విధ్వంసం ఏ మేరకు సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి చివరి ఓవర్లో క్లాసెన్.. అట్కిన్సన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. సఫారీలకు ఇంగ్లండ్ పై ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లీకి మూడు వికెట్లు దక్కగా రషీద్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

