AUS vs PAK | రికార్డులే రికార్డులు.. బెంగళూరులో కంగారూల కొత్త చరిత్ర
AUS vs PAK | వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 367 పరుగుల భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా పలు కొత్త రికార్డులు సృష్టించింది.
AUS vs PAK | వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 367 పరుగుల భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా పలు కొత్త రికార్డులు సృష్టించింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (163), మిచెల్ మార్ష్ (121)లు సెంచరీలు చేయడంతో ఆ జట్టు తొలి వికెట్‌కు ఏకంగా 259 పరుగుల భారీ స్కోరు సాధించింది. వన్డే వరల్డ్‌కప్ లో రికార్డు స్థాయిలో తొలి వికెట్ భాగస్వామ్యంతో పాటు మరిన్ని రికార్డులు క్రియేట్ చేసింది. అవేంటంటే…
పుట్టినరోజు సెంచరీ..
మిచెల్ మార్ష్ ఈమ్యాచ్‌లో సెంచరీ చేయగా నేడు అతడి పుట్టినరోజు. వన్డేలలో బర్త్ డే రోజు సెంచరీచేసిన ఆటగాళ్ల జాబితాలో టామ్ లాథమ్, రాస్ టేలర్ (కివీస్), సచిన్ టెండూల్కర్, వినోది కాంబ్లీ (ఇండియా), సనత్ జయసూర్య (శ్రీలంక) లు మార్ష్ కంటే ముందున్నారు. రాస్ టేలర్ కూడా తన పుట్టినరోజున పాకిస్తాన్‌పైనే సెంచరీ చేశాడు.
– ఒక వరల్డ్ కప్ గేమ్ లో ఇద్దరు ఓపెనర్లు సెంచరీ చేసిన జాబితాలో వార్నర్, మార్ష్ లు నాలుగో స్థానంలో నిలిచారు. అంతకుముందు ఉపుల్ తరంగ (రెండుసార్లు), రోహిత్ శర్మ – కెఎల్ రాహుల్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
– మార్ష్- వార్నర్‌లు తొలి వికెట్‌కు 259 పరుగులు జోడించారు. వరల్డ్ కప్ లో ఏ వికెట్ కు అయినా నమోదైన అత్యుత్తమ భాగస్వామ్యాలలో ఇది ఆరోది. క్రిస్ గేల్ – మార్లన్ సాముల్స్ (372), గంగూలీ – ద్రావిడ్ (318), దిల్షాన్ – తరంగ (282), డెవాన్ కాన్వే – రచిన్ రవీంద్ర (273), డేవిడ్ వార్నర్ – స్మిత్ (260) లు ముందున్నారు.
The vintage David Warner celebration. pic.twitter.com/0FXQWMwYba
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 20, 2023
– ఆస్ట్రేలియా తరఫున వన్డేలలో అత్యుత్తమ ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో వార్నర్ – మార్ష్ ల జోడీ మూడో స్థానంలో ఉంది. వార్నర్ – హెడ్ (284), వార్నర్ – హెడ్ (269), వార్నర్ – మార్ష్ (259), వార్నర్ – పించ్ (258)లు టాప్-4లో ఉన్నారు.
– ఈ మ్యాచ్‌లో 85 బంతుల్లోనే సెంచరీ చేసిన వార్నర్‌కు పాకిస్తాన్‌పై ఇది వరుసగా నాలుగో శతకం కావడం గమనార్హం. గత నాలుగు మ్యాచ్‌లలో వార్నర్ పాకిస్తాన్ పై.. 130, 179, 107, 163 పరుగులు సాధించాడు. ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (విండీస్ పై నాలుగు) తర్వాత వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు.
– వన్డే వరల్డ్ కప్‌లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్ రికీ పాంటింగ్, కుమార సంగక్కర (ఐదు సెంచరీలు) లతో సమానంగా మూడో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ (7), సచిన్ టెండూల్కర్ (6)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
– వన్డే ఫార్మాట్లో అత్యధిక 150 ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్లలో వార్నర్.. రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 8 సార్లు ఈ ఘనత అందుకోగా వార్నర్ ఏడు సార్లు సాధించాడు. వార్నర్‌కు వన్డేలలో ఇది 21వ శతకం. మొత్తంగా 47వది.
– ఆస్ట్రేలియా తరఫున వన్డే వరల్డ్ కప్‌లలో టాప్ -3 స్కోర్లలో మూడూ వార్నర్వే కావడం గమనార్హం. 178, 166, 163 తో వార్నర్ భాయ్ అరుదైన ఘనత దక్కించుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

