CSA T20 League | సఫారీ గడ్డపై జెండా పాతనున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు..!
బీసీసీఐ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోర్డుకు, ఆటగాళ్లకు, ఫ్రాంచైజీలకు కాసుల పంట పండిస్తున్న ఈ టోర్నీ ఇచ్చిన స్ఫూర్తితో మిగిలిన దేశాలు సైతం ఫ్రాంచైజీ క్రికెట్ ను ఎలా నిర్వహించాలనేదానిపై ఆసక్తి కనబరుస్తున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్ అసోసియేషన్ (సీఎస్ఎ) కూడా టీ20 క్రికెట్ లీగ్ కు తెరలేపింది. అయితే అక్కడ ఏదైనా కొత్త జట్లు, కొత్త ఓనర్లు వస్తారనుకుంటున్నారేమో..! జట్ల పేర్లు మాత్రమే ఛేంజ్.. మిగతాదంతా ఐపీఎల్ నమూనానే..
ఫుట్‌బాల్ లో మాంచెస్టర్ యూనైటెడ్, లివర్ పూల్, పీఎస్జీ మాదిరిగా ఫేమస్ అయ్యాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఇవి ప్రస్తుతం ఖండాంతరాలు వ్యాపిస్తున్నాయి. పేరుకు దక్షిణాఫ్రికాలోక్రికెట్ లీగ్ అయినా అక్కడ ఫ్రాంచైజీలను దక్కించుకున్నది మన ‘ఘనులే’ అని మీడియా కోడై కూస్తున్నది.
ఇప్పటికే యూఏఈ వేదికగా జరుగుతున్న యూఏఈ టీ20 లీగ్ తో పాటు కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) లో జట్లను కొనుగోలు చేసిన పలువురు బడా భారతీయ పారిశ్రామికవేత్తలు.. తాజాగా సీఎస్ఎ టీ20 క్రికెట్ లీగ్ లో కూడా ఫ్రాంచైజీలను దక్కించుకున్నారని సమాచారం. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలలో జరుగబోయే ఈ మెగా టోర్నీలో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉండనున్నాయి. ఆ ఆరు జట్లు.. కేప్‌టౌన్, జోహెన్నెస్‌బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, ప్రిటోరియా, పార్ల్.
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ (అంబానీ) – కేప్‌టౌన్ ను చెన్నై సూపర్ కింగ్స్ (ఎన్.శ్రీనివాసన్) జోహన్నెస్‌బర్గ్ ను లక్నోసూపర్ జెయింట్స్ (సంజీవ్ గొయెంకా) డర్బన్ ను, సన్ రైజర్స్ హైదరాబాద్ (మారన్) పోర్ట్ ఎలిజిబెత్ ను, ఢిల్లీ క్యాపిటల్స్ (పార్థ్ జిందాల్) ప్రిటోరియాను రాజస్తాన్ రాయల్స్ (మనోజ్ బదాలే) పార్ల్ ఫ్రాంచైజీలను దక్కించుకున్నట్టు క్రిక్ బజ్ నివేదికలో వెల్లడించింది. త్వరలోనే వీరి పేర్లను అధికారికంగా వెల్లడించే అవకాశముంది.
సీఎస్ఎ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఈ టోర్నీకి ఆ జట్టు మాజీ సారథి గ్రేమ్ స్మిత్ కమిషనర్ గా వ్యవహరించబోతున్నాడు. ఇక బ్రాడ్కస్ట్ హక్కులు సూపర్ స్పోర్ట్స్ ఛానెల్ దక్కించుకుంది. మొత్తంగా చూస్తే సీఎస్ఏ టీ20 లీగ్ జరిగేది దక్షిణాఫ్రికాలో అయినా ఓనర్లు మాత్రం మనోళ్లే. దీంతో ట్విటర్ లో అభిమానులంతా ఈ లీగ్ ను ‘మినీ ఐపీఎల్’ అని అభివర్ణిస్తున్నారు.
Cricket South Africa’s all-new T20 League has an interesting line-up of owners
Looks like a mini-IPL is on the cards#CSA #IPL #CricketTwitter #SouthAfrica pic.twitter.com/aKxiBC2yS4
— OneCricket (@OneCricketApp) July 19, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్
‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
Plague | ప్లేగు భయంతో రూ.300 కిట్ విక్రయాలు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. సీబీఐ, గిరిబాలా సింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
AP Minister | పొత్తులో జనసేనకు సీటు.. కంటతడి పెట్టుకున్న ఏపీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

