Cristiano Ronaldo | క్లబ్స్ తరఫున 500 గోల్స్ కొట్టిన రొనాల్డో
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో ఘనత సాధించాడు. క్లబ్స్ తరఫున 500 గోల్స్ చేశాడు. సౌదీ ప్రో లీగ్‌లో 30 నిమిషాల వ్యవధిలో నాలుగు గోల్స్ చేశాడు. రియల్ మాడ్రిడ్ తరఫున ఈ స్టార్ ప్లేయర్ అత్యధికంగా 311 గోల్స్ కొట్టాడు.
Cristiano Ronaldo : పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో ఘనత సాధించాడు. క్లబ్స్ తరఫున 500 గోల్స్ చేశాడు. సౌదీ ప్రో లీగ్‌లో నాలుగు గోల్స్ కొట్టి ఈ రికార్డుకు చేరువయ్యాడు. అల్ వెహ్దాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో చెలరేగిపోయాడు. మునపటి రొనాల్డోను గుర్తు చేస్తూ 30 నిమిషాల వ్యవధిలో బంతిని నాలుగు సార్లు గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దాంతో, ఆల్ నస్రీ క్లబ్ 4-0తో గెలుపొందింది. ప్రస్తుతం అతని ఖాతాలో 503 గోల్స్ ఉన్నాయి.
ఏ క్లబ్ తరఫున ఎన్ని..?
పోర్చుగల్‌లోని సావో పెడ్రో అనే చిన్న ద్వీపంలో పుట్టిన రొనాల్డో మొదట్లో అండోరిన్హా, నసియోనల్ వంటి స్థానిక క్లబ్స్‌కు ఆడాడు. ఆటలో నైపుణ్యం సాధించిన అతను 18 ఏళ్లకే సీనియర్ టీమ్‌కు ఆడాడు. అతను ఇప్పటి వరకు ఐదు క్లబ్స్‌కు ఆడాడు. రియల్ మాడ్రిడ్ తరఫున ఈ స్టార్ ప్లేయర్ అత్యధికంగా 311 గోల్స్ కొట్టాడు. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు ఆడిన రొనాల్డో 103 గోల్స్ చేశాడు. జువెంటస్ క్లబ్‌కు ఆడిన సమయంలో 81 గోల్స్ చేశాడు. స్పోర్టింగ్ లెబనాన్ క్లబ్ తరఫున 3, ప్రస్తుతం ఆడుతున్న ఆల్ నస్రీ క్లబ్ 5 గోల్స్ కొట్టాడు.
రూ. 4400 కోట్లకు
ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఒక ఇంటర్వ్యూలో రొనాల్డో, మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దాంతో, ఆ క్లబ్ అతడితో ఒప్పందం రద్దు చేసుంది. ఆ స్టార్ ప్లేయర్‌ను ఆల్ నస్రీ క్లబ్ కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకుంది. రూ. 4400 కోట్లకు అతడితో కాంట్రాక్టు కుదుర్చుకుంది. 2025 వరకు అతను ఈ క్లబ్‌తో కొనసాగుతాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

