Cristiano Ronaldo : ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్లో సౌదీ ప్రో లీగ్‌లో తొలి మ్యాచ్ ఆడాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రొనాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్ నస్రీ క్లబ్, ఎట్టిఫాక్ క్లబ్‌పై 1-0తో గెలుపొందింది. అయితే.. ఈ స్టార్ ప్లేయర్ మాత్రం ఒక్క గోల్ కూడా చేయకుండా అందరినీ నిరాశ పరిచాడు. 90 నిమిషాలు మైదానంలో ఉన్న అతను గోల్ చేయడంలో విఫలం అయ్యాడు. జనవరి 19న రియాద్ స్టేడియంలో మెస్సీ కెప్టెన్సీలోని పీఎస్జీతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో రొనాల్డో చెలరేగాడు. రెండు గోల్స్ కొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఫిఫా వరల్డ్ కప్ తర్వాత రొనాల్డోను సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రీ క్లబ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. రూ. 4400 కోట్లకు అతడితో ఒప్పందం చేసుకుంది. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు బ్రిటీష్ జర్నలిస్ట్‌కు రొనాల్డో ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదమైంది. దాంతో మాంచెస్టర్ యూనైటెడ్ క్లబ్ అతడితో కాంట్రాక్టు రద్దు చేసుకుంది.