రియాద్: అల్ నసర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన వ్యవహార శైలి కారణంగా మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. సోమవారం అబుదాబి వేదికగా అల్ హిలాల్తో జరిగిన మ్యాచ్లో తనకు రెడ్ కార్డు చూపించిన రిఫరీపై దాడికి యత్నించిన అతడు రెండు మ్యాచ్ల నిషేధానికి గురయ్యాడు. సౌదీ సూపర్కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో భాగంగా అల్ హిలాల్తో మ్యాచ్లో అలి అల్ బులైహిని 86వ నిమిషంలో మోచేతితో బలంగా నెట్టేసిన రొనాల్డోకు రిఫరీ రెడ్ కార్డ్ చూపించాడు. దీంతో ఆగ్రహంతో ఉన్న రొనాల్డో రిఫరీపైనా పిడిగుద్దులతో దాడిచేసేందుకు యత్నించాడు.