Cristiano Ronaldo | అల్ నస్రీ క్లబ్ తరఫున తొలి గోల్ కొట్టిన రొనాల్డో.. వీడియో వైరల్
స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ తరఫున తొలి గోల్ కొట్టాడు. సౌదీ ప్రో లీగ్‌లో అల్ ఫతేహ్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో చివరి నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలిచాడు.
Cristiano Ronaldo : స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ తరఫున తొలి గోల్ కొట్టాడు. కోట్లు కుమ్మరించి తనను కొనుగోలు చేసిన అల్ నస్రీ క్లబ్‌కు ఎట్టకేలకు న్యాయం చేశాడు. సౌదీ ప్రో లీగ్‌లో అల్ ఫతేహ్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో చివరి నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలిచాడు. అదనపు సమయం చివరి నిమిషంలో అతను గోల్ చేయడంతో మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. మామూలుగా అయితే గోల్ కొట్టిన అనంతరం రొనాల్డో తన సిగ్నేచర్ స్టయిల్లో సెలబ్రేట్ చేసుకుంటాడు. అయితే.. ఈసారి మాత్రం గోల్ పోస్టులోకి వెళ్లి బంతి అందుకుని కొంత దూరం పరుగెత్తాడు. రొనాల్డో గోల్ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆల్ నస్రీ క్లబ్ ఈ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
ఆల్ నస్రీ క్లబ్ ఈమధ్యే రూ.4400 వేల కోట్ల భారీ ధరకు రొనాల్డోతో ఒప్పందం చేసుకుంది. ఫిఫా వరల్డ్ కప్ సమయంలో మాంచెస్టర్ యూనైటెడ్ క్లబ్ అతడితో కాంట్రాక్టు రద్దు చేసుకుంది. దాంతో, రొనాల్డోతో ఒప్పందం చేసుకునేందుకు పలు క్లబ్స్ పోటీపడ్డాయి. అయితే.. సౌదీ అరేబియా క్లబ్ అల్ నస్రీ భారీ ధర ఆఫర్ చేసింది. రెండున్నరేళ్ల పాటు రొనాల్డో ఆ క్లబ్‌తో కొనసాగనున్నాడు. రొనాల్డో జనవరి 22న ఆల్ నస్రీ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. అయితే.. ఆ మ్యాచ్‌లో ఎత్తిఫక్ జట్టుపై 1-0తో ఆల్ నస్రీ గెలుపొందింది. అయితే.. రొనాల్డో ఈ మ్యాచ్‌లో గోల్ చేయడంలో విఫలమయ్యాడు.
د90+3′ هدف التعادل لـ النصر عن طريق كريستيانو رونالدو
الفتح 2 × 2 النصر#الفتح_النصر | #CR7 | #SSC pic.twitter.com/5SYppTQXlU
— شركة الرياضة السعودية SSC (@ssc_sports) February 3, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

