Harvinder Singh | ప్రాణమైన ఆటను వదిలేసి.. విధి పరీక్షలో నెగ్గిన అసలైన ఆల్‌రౌండర్!
Harvinder Singh : ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ దాగుంటుంది. కానీ కొంతమంది అపార ప్రతిభావంతులు ఉంటారు. రెండో కోవకు చెందినవాడే హర్వీందర్ సింగ్ సంధు(Harvinder Singh Sandhu). క్రికెటర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సంధు ఆ తర్వాత పరిస్థితుల కారణంగా క్యాబ్ డ్రైవర్‌గా, సింగర్‌గా, యాక్టర్‌గా వివిధ రంగాల్లో రాణించాడు. ఒకప్పుడు భారత అండర్-19 జట్టు(Under -19 Team)లో సభ్యుడైన...
Harvinder Singh : ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ దాగుంటుంది. కానీ కొంతమంది అపార ప్రతిభావంతులు ఉంటారు. రెండో కోవకు చెందినవాడే హర్వీందర్ సింగ్ సంధు(Harvinder Singh Sandhu). క్రికెటర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సంధు ఆ తర్వాత పరిస్థితుల కారణంగా క్యాబ్ డ్రైవర్‌గా, సింగర్‌గా, యాక్టర్‌గా వివిధ రంగాల్లో రాణించాడు. ఒకప్పుడు భారత అండర్-19 జట్టు(Under -19 Team)లో సభ్యుడైన హర్వీందర్..శిఖర్ ధవన్(Shikhar Dhawan), చతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ లాంటి టీమ్ఇండియా క్రికెటర్లతో కలిసి ఆడాడు. ఫాస్ట్‌బౌలర్ అయిన హర్వీందర్, ధవన్‌తో రూమ్మేట్గా కొనసాగాడు.
సాఫీగా సాగుతున్న హర్వీందర్‌సింగ్ కెరీర్లో అనుకోని అవాంతరం ఏర్పడింది. 2006లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో సంధు మోచేతి గాయానికి గురయ్యాడు. సొంత రాష్ట్రం పంజాబ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన హర్వీందర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. దీంతో జాతీయ జట్టుకు ఆడాలన్న కల నెరవేరకుండానే హర్వీందర్ అర్ధాంతరంగా కెరీర్ ముగించాల్సి వచ్చింది.
హర్వీందర్ సింగ్

మెరుగైన చికిత్స కోసం ఆస్ట్రేలియాకు వెళ్లినా సంధు ఆరోగ్యం చాన్నాళ్ల వరకు కుదుటపడలేదు. అక్కడ దవాఖాన బిల్లు చెల్లించడం కోసం సంధు క్యాబ్ డ్రైవర్(Cab Driver)గా మారాడు. క్యాబ్‌లో ఒంటరిగా వెళ్లేటప్పుడు పాటలు పాడడం అతడికి అలవాటుగా మారింది. ఇలా ఓవైపు క్యాబ్ నడుపుతూనే సంధు తన చదువు కొనసాగించాడు.
సింగర్‌గా హర్వీందర్

2007 నుంచి క్రికెట్‌కు పూర్తిగా దూరమైన హర్వీందర్ పూర్తిస్థాయి సింగర్‌గా మారిపోయాడు. ఇందుకోసం ఏడాదిన్నర పాటు కష్టపడ్డాడు. 2011లో ‘దిస్ ఈజ్ హార్డీ సంధు’(This Is Hardy Sandhu) పేరిట ఆల్బమ్‌ను విడుదల చేశాడు. సోచ్(2013), జోకర్(2014)తో పాపులర్‌గా మారిపోయాడు. పటియాలకు చెందిన సంధు 2014లో ‘యారాన్ ద క్యాచప్’ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
83 సినిమాలో మదన్ లాల్‌గా నటించిన సంధు

1983 క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు నేపథ్యంగా వచ్చిన ‘83’ సినిమాలో హర్వీందర్ ఫాస్ట్ బౌలర్ మదన్ లాల్(Madan Lal)గా నటించి మెప్పించాడు. ఇలా క్రికెటర్‌గా కెరీర్ మొదలుపెట్టి సంధు సింగర్‌గా, డ్రైవర్‌గా, యాక్టర్‌గా మారిన వైనం ఎందరికో స్ఫూర్తిదాయకం.
ఇవి కూడా చదవండి
Team India | ఆ ఇద్దరినీ త్వరలోనే బౌలర్లుగా చూస్తారు : టీమిండియా బౌలింగ్ కోచ్
Kuldeep Yadav | కుల్దీప్ కండ్లు చెదిరే క్యాచ్!.. వావ్ అంటున్న ఫ్యాన్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
Rashmika | విజయ్ను 100 కాదు.. 1000 సార్లు ప్రపోజ్ చేస్తా.. ట్రోలర్లకు రష్మిక గట్టి సమాధానం!
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

