తెలుగులో అనర్గళంగా మాట్లాడిన దినేష్ కార్తీక్.. ఫ్యాన్స్ ఫిదా..
Dinesh Karthik | కోల్‌కతా నైట్ రైడర్స్ కీపర్ దినేష్ కార్తీక్ తెలుగులో మాట్లాడి.. తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. అది కూడా అచ్చమైన తెలుగులో అనర్గళంగా మాట్లాడటంతో దినేష్ ఫ్యాన్స్ ఫిదా

ఐపీఎల్-14లో చెన్నై సూపర్‌కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దుబాయి వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించింది. నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.
అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కంటే ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ కీపర్ దినేష్ కార్తీక్ తెలుగులో మాట్లాడి.. తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. అది కూడా అచ్చమైన తెలుగులో అనర్గళంగా మాట్లాడటంతో దినేష్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెల్ లో ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే దినేష్ కార్తీక్‌ను ఇంటర్వ్యూ చేశారు.
ఈ సందర్భంగా దినేష్ కార్తీక్ తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2021 ఫైనల్లో ఏమైనా ఒత్తిడి ఉందా అనే ప్రశ్నకు.. సాధారణ మ్యాచ్‌లానే ఫైనల్‌ను పరిగణిస్తున్నామని, ఒత్తిడి లేదంటూ చెప్పుకొచ్చాడు. ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాక్టీస్ చేశామని, సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. తమ జట్టు సెకండాఫ్‌లో అద్భుతంగా రాణించిందని పేర్కొన్నాడు. ఫైనల్‌కు చేరేందుకు ఆటగాళ్లు ఎంతో శ్రమించారని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఇలా పూర్తి ఇంటర్య్యూను తెలుగులో మాట్లాడి ఫ్యాన్స్‌ను మెప్పించాడు. దీంతో దినేష్ కార్తీక్ అచ్చం తెలుగువాడిలా మాట్లాడి ఆకట్టుకున్నాడని నెట్టింట్లో కామెంట్లు చేస్తూ ఈ వీడియోను షేర్ చేశారు.
తెలుగు వ్యక్తి అయినా హర్షా భోగ్లే సైతం దినేష్ కార్తీక్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. తెలుగు ఇంటర్వ్యూ చేస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నాడు. ఇదిలా ఉంటే, డీకే.. 2020 ఐపీఎల్ సందర్భంగా కూడా తెలుగులో మాట్లాడి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
Wow. @DineshKarthik is killing it in Telugu. As fluent as his on field conversations in Tamil with Varun Chakravarthy. #IPLFinal https://t.co/wzXWSdp2Rf pic.twitter.com/FmXdU8rY0w
— Krishnamurthy (@krishna0302) October 15, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

