జితేందర్‌రెడ్డి X మహేశ్ గౌడ్
తెలంగాణ ఒలింపిక్ సంఘం(టీవోఏ)లో కాంగ్రెస్ కుంపటి రాజుకుంది. ఈమధ్యే అధ్యక్షుడిగా ఎన్నికైన ఏపీ జితేందర్‌రెడ్డికి, ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. గత నెలలో జరిగిన టీవోఏ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన జితేందర్‌రెడ్డి వర్గానికి భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
- టీవోఏలో వర్గపోరు
- జితేందర్‌రెడ్డి ప్యానెల్‌కు ఐవోఏ షాక్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్ సంఘం(టీవోఏ)లో కాంగ్రెస్ కుంపటి రాజుకుంది. ఈమధ్యే అధ్యక్షుడిగా ఎన్నికైన ఏపీ జితేందర్‌రెడ్డికి, ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. గత నెలలో జరిగిన టీవోఏ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన జితేందర్‌రెడ్డి వర్గానికి భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పలు న్యాయపరమైన చిక్కులు దాటి ఎన్నికైన కార్యవర్గానికి ఐవోఏ గుర్తింపు కూడా దక్కలేదు. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉత్తరాఖండ్‌లో 39వ జాతీయ క్రీడలు జరుగనున్నాయి. సాధారణంగా జాతీయ క్రీడలకు జట్లను ఎంపిక చేసే బాధ్యతను ఆయా రాష్ర్టాల ఒలింపిక్ సంఘాలకు ఐవోఏ అప్పగిస్తుంది. కానీ టీవోఏను గుర్తించని ఐవోఏ..ఈనెల 6న రాష్ట్ర క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు లేఖ రాసింది.
ఇందులో ప్రస్తుత సాట్స్ ఎండీ సోనీబాలదేవిని చెఫ్ డీ మిషన్‌గా ఎంపిక చేస్తున్నట్లు పీటీ ఉష తమ అధికారిక లేఖలో పేర్కొన్నారు. ఆమెకు తోడు టీవోఏ మాజీ కోశాధికారి మహేశ్వర్, ఆర్చరీ సంఘం కార్యదర్శి సంజీవరెడ్డిని డిప్యూటీలుగా నియమిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆయా జట్ల ఎంపిక బాధ్యతను టీవోఏ నుంచి తప్పిస్తున్నట్లయ్యింది. ఎన్నికల్లో ఐవోఏ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కడంతో టీవోఏకు గుర్తింపు దక్కకుండా పోయింది.
దీనికి తోడు ఎన్నికల్లో జిల్లా సంఘాలకు ఓటు హక్కు కల్పించడం, ఎలక్ట్రోరల్ కాలేజీ జాబితాలో తప్పులు ఉండటం, జాతీయ స్పోర్ట్స్‌కోడ్‌ను పాటించకపోవడం, ఐవోఏ పరిశీలకుడు లేకపోవడం వంటి కారణాలతో టీవోఏ గుర్తింపునకు నోచుకోకుండా పోయింది. దీనిపై మంగళవారం సమావేశమైన టీవోఏ ప్యానెల్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ముగించింది. ఇదిలా ఉంటే అసోసియేషన్ రోజువారీ వ్యవహారాలు నిర్వహించేందుకు ఐవోఏ అడ్‌హక్ కమిటీ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

