Champions Trophy | ఫిబ్రవరి 19న చాంపియన్స్ ట్రోఫీ.. భారత జట్టు ఆడేనా..?
Champions Trophy : ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) షెడ్యూల్ ఖరారైంది. పాకిస్థాన్ (Pakistan) వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన మెగా టోర్నీ షురూ కానుంది. ఆతిథ్య పాక్ జట్టు ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
Champions Trophy : ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) షెడ్యూల్ ఖరారైంది. పాకిస్థాన్ (Pakistan) వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన మెగా టోర్నీ షురూ కానుంది. మార్చి 9వ తేదీన విజేత ఎవరో తేలిపోనుంది. ఆతిథ్య పాక్ జట్టు ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. టోర్నీ నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాక్ ఇప్పటికే వేదికలను ఖరారు చేసింది. కరాచీ, లాహోర్, రావల్పిండిలో మ్యాచ్‌లు నిర్వహించనున్నామని పాక్ క్రికెట్ బోర్డు(PCB) వెల్లడించిన విషయం తెలిసిందే.
ఐసీసీ చివరిసారిగా 2017లో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో టీమిండియాను ఓడించిన పాక్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. దాంతో, 2025 టోర్నీ నిర్వహణ హక్కులను పాక్ దక్కించుకుంది. అయితే.. దాయాది గడ్డపై భారత జట్టు(Team India) ఆడుతుందా? లేదా? అని యావత్ క్రీడాలోకమంతా ఆసక్తిగా ఉంది.

ఎందుకంటే.. నిరుడు ఆసియా కప్(Asia Cup 2023) సమయంలోనే భద్రతా కారణాలతో పాక్‌లో ఆడమని బీసీసీఐ తేల్చి చెప్పేసింది. దాంతో, మరోదారి లేక హైబ్రిడ్ మోడల్ (Hybrid Model)లో టోర్నీని నిర్వహించారు. అయితే.. భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్‌లో పాక్ జట్టు ఆడింది.

దాంతో, ‘మేము మా జట్టును పంపాం. కాబట్టి ఈసారి బీసీసీఐ కూడా తమ జట్టును మా దేశానికి పంపాలి’ అని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ ఖాన్(Mohsin Khan) ఇప్పటికే డిమాండ్ చేశాడు. కానీ, ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా మాత్రం ఇంకా స్పందించలేదు.
ఇవి కూడా చదవండి
- NBK 109 | మాన్స్టర్ గురించి చెప్పే టైం ఫిక్స్.. బాలకృష్ణ ఎన్బీకే 109 లుక్ వైరల్
- T20 World Cup 2024 | న్యూయార్క్‌లో బిగ్ ఫైట్.. దాయాదిపై మనోళ్ల రికార్డులివే
- Jupalli Krishna Rao | ఈ నెల 14,15న హెటెక్స్‌లో జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

