Shikhar Dhawan | బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. కర్నల్ సోఫియా ఖురేషీకి మద్దతుగా నిలిచిన శిఖర్ ధావన్
Shikhar Dhawan supports Colonel Sophia Qureshi | భారత సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Shikhar Dhawan supports Colonel Sophia Qureshi | భారత సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ కార్యక్రమంలో పాల్గోన్న విజయ్ షా మాట్లాడుతూ.. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచి, వితంతువులను చేశారు. అయితే అదే ఉగ్రవాదుల మతానికి చెందిన సోదరి(సోఫియా ఖురేషీ)ని సైనిక విమానంలో మోదీజీ పాక్‌కు పంపించి పాఠం నేర్పించారు అని విజయ్ షా వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, మధ్యప్రదేశ్ బీజేపీ హైకమాండ్ విజయ్ షాను పిలిపించి మందలించింది. అనంతరం, విజయ్ షా స్పందిస్తూ, ఉగ్రవాదుల దుశ్చర్యలతో తన మనస్సు కలత చెందడం వల్ల అలా మాట్లాడానని, కులమతాలకు అతీతంగా ఖురేషీ చేసిన సేవలకు తాను సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. ఆమెను కించపరిచే ఆలోచన తనకెప్పుడూ లేదని, తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే పదిసార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధమని అన్నారు.
మరోవైపు, మంత్రి విజయ్ షా వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలతో పాటు సినీ ప్రముఖులు తప్పుబడుతూ సోఫియాకి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్(Shikar Dhawan) కూడా విజయ్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ.. కర్నల్ సోఫియా ఖురేషీకి మద్దతుగా నిలిచాడు.
”భారతదేశం యొక్క గొప్పతనం దాని ఐకమత్యంలోనే ఉంది. కల్నల్ సోఫియా ఖురేషి లాంటి ధైర్యవంతులకు, దేశం కోసం ఎంతోమంది పోరాడిన భారతీయ ముస్లింలకు నా అభినందనలు. మనం దేని కోసం నిలబడతామో వాళ్ళు చూపించారు. జై హింద్!” అంటూ శిఖర్ ధావన్ రాసుకోచ్చాడు.
The spirit of India lies in its unity. Hats off to heroes like Colonel Sofia Qureshi and to the countless Indian Muslims who’ve bravely fought for the nation and showed what we stand for. Jai Hind! 🇮🇳
— Shikhar Dhawan (@SDhawan25) May 15, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

