Dipendra Singh Airee | 6 బంతుల్లో ఆరు సిక్స్‌లతో దుమ్మురేపిన నేపాల్ హార్డ్‌హిట్టర్
టీ20 క్రికెట్లో మరో సంచలనం! అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ క్రికెట్ పసికూన నేపాల్ తమ సత్తాఏంటో ప్రపంచానికి చూపెట్టింది. ఏసీసీ ప్రీమియర్ కప్ టీ20 ఇంటర్నేషనల్ టోర్నీలో భాగంగా ఖతార్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్ హార్డ్‌హిట్టర్ దీపేంద్రసింగ్ ఐరీ (21బంతుల్లో 64 నాటౌట్)ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లతో దుమ్మురేపాడు.
- నేపాల్ క్రికెటర్ దీపేంద్ర రికార్డు ఫీట్
- యువరాజ్‌సింగ్, పొలార్డ్ సరసన
Dipendra Singh Airee | అల్ అమెరాత్(ఖతార్): టీ20 క్రికెట్లో మరో సంచలనం! అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ క్రికెట్ పసికూన నేపాల్ తమ సత్తాఏంటో ప్రపంచానికి చూపెట్టింది. ఏసీసీ ప్రీమియర్ కప్ టీ20 ఇంటర్నేషనల్ టోర్నీలో భాగంగా ఖతార్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్ హార్డ్‌హిట్టర్ దీపేంద్రసింగ్ ఐరీ (21బంతుల్లో 64 నాటౌట్)ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లతో దుమ్మురేపాడు. ఖతార్ బౌలర్ కమ్రాన్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో దీపేంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అప్పటి వరకు 15 బంతుల్లో 28 పరుగులు చేసిన ఈ యువ క్రికెటర్..కమ్రాన్ ఆరు బంతులను ఆరు సిక్స్‌లుగా మలిచి అద్భుతం చేశాడు.
బంతి పిచ్‌పై పడితే ఆలస్యం..ఆకలిగొన్న పులిలా వేటాడిన దీపేంద్ర బౌండరీ బయటకు పంపాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో ఈ ఫీట్ సాధించిన మూడో క్రికెటర్‌గా భారత దిగ్గజ క్రికెటర్ యువరాజ్‌సింగ్‌తో పాటు కీరన్ పొలార్డ్ సరసన చేరాడు. దీపేంద్ర దంచుడుతో నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 210/7 స్కోరు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనలో ఖతార్ 178/9 స్కోరుకు పరిమితమైంది. బ్యాటింగ్‌లో దుమ్మురేపిన దీపేం ద్ర.. బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యా చ్’గా నిలిచా డు. అన్నట్లు ఈ మ్యాచ్‌లో నేపాల్ 32 పరుగులతో గెలిచింది.
టీ20ల్లో సిక్సర్ల వీరులు
- యువరాజ్‌సింగ్-దక్షిణాఫ్రికాపై (2007)
- కీరన్ పొలార్డ్-శ్రీలంకపై (2021)
- దీపేంద్రసింగ్-ఖతార్‌పై (2024)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

