Ben Stokes: బెన్ స్టోక్స్ అరుదైన ఘనత.. ఆ జాబితాలో తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా రికార్డు
Ben Stokes: డచ్ టీమ్‌పై సెంచరీ చేసిన స్టోక్స్.. అంతర్జాతీయ క్రికెట్లో పదివేల పరుగులు చేసి వంద వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచాడు.
Ben Stokes: వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ వెటరన్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనతను సాధించాడు. డచ్ టీమ్‌పై సెంచరీ చేసిన స్టోక్స్.. అంతర్జాతీయ క్రికెట్లో పదివేల పరుగులు చేసి వంద వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచాడు. తద్వారా స్టోక్స్ పలువురు దిగ్గజాల సరసన చేరాడు. నెదర్లాండ్స్‌పై సెంచరీ చేసిన స్టోక్స్‌కు వరల్డ్ కప్‌లో ఇదే తొలి శతకం కావడం మరో విశేషం.
అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి పదివేలకు పైగా పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితాలో లంక దిగ్గజం తిలకరత్నె దిల్షాన్ (10,290 పరుగులు, 106 వికెట్లు), సౌరవ్ గంగూలీ (11, 363 పరుగులు, 100 వికెట్లు), జాక్వస్ కలిస్ (11, 579 పరుగులు, 273 వికెట్లు), సనత్ జయసూర్య (13, 430 రన్స్, 323 వికెట్లు) క్రిస్ గేల్ (10, 480 రన్స్, 167 వికెట్లు), సచిన్ టెండూల్కర్ (18,426 రన్స్, 154 వికెట్లు) ఉన్నారు. అయితే వీళ్లందరూ వన్డేలలో ఈ ఘనత సాధించారు.
టెస్టులలో జాక్వస్ కలిస్ ఒక్కడే పదివేలకు పైగా పరుగులు (13,289 రన్స్), 292 వికెట్లు సాధించాడు. బెన్ స్టోక్స్.. ఇప్పటివరకూ 112 వన్డేలలో 3,379 పరుగులు (74 వికెట్లు) చేయగా 97 టెస్టులలో 6,117 రన్స్ (197 వికెట్లు) సాధించాడు. 43 టీ20లలో 585 రన్స్ (26 వికెట్లు) చేశాడు. 2011 నుంచి ఇంగ్లండ్‌కు ఆడుతున్న స్టోక్స్.. గతేడాది వన్డేలకు గుడ్ బై చెప్పినా వన్డే వరల్డ్ కప్ కోసం రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని ఆడుతున్న విషయం తెలిసిందే.
A special landmark for a special player ❤️
Take a bow, Ben Stokes 👑 #EnglandCricket | #CWC23 pic.twitter.com/RJxpnzNkBe
— England Cricket (@englandcricket) November 8, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

