Under -19 Squad : వయసు సంబంధిత నేరానికి పాల్పడిన యువ క్రికెటర్ రోహిత్ యాదవ్(Rohit Yadav)పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వేటు వేసింది. ఏజ్ ఫ్రాడ్‌ను తీవ్రంగా పరిగణించి ఇప్పటికే ఈ లెగ్ స్పిన్నర్‌పై రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐ అండర్-19 స్క్వాడ్ నుంచి అతడిని తప్పించింది. దాంతో, ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ స్థానంలో వన్డే మ్యాచ్‌లకు ఒకరిని, మల్టీ డే మ్యాచ్‌లకు హర్యానా క్రికెటర్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు.
ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించిన భారత అండర్-19 స్క్వాడ్‌లో కీలక మార్పులు చేసింది బీసీసీఐ. శ్రీలంకపై రాణించి ఆసీస్‌లో వన్డే, మల్టీ డే మ్యాచ్‌లకు ఎంపికైన రోహిత్ యాదవ్‌ను స్క్వాడ్ నుంచి తప్పించింది. ఏజ్ ఫ్రాడ్ కారణంగా ఇప్పటికే అతడిపై రెండేళ్లు నిషేధం విధించిన బీసీసీఐ.. ఇప్పుడు స్క్వాడ్ నుంచి తొలగించి మరో షాకిచ్చింది. రోహిత్ స్థానంలో సౌరాష్ట్ర క్రికెట్ సంఘానికి చెందిన ఆర్యన్ సవ్సని వన్డే స్క్వాడ్‌లోకి వచ్చాడు. హర్యానా క్రికెట్ సంఘానికి చెందిన స్పిన్నర్ తన్మయ్ బలోడా మల్టీ డే మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు.
Aryan Savsani, Tanmay Baloda added to India U19 squads for Australia series
Read @ANI Story I https://t.co/LpxR7GVw69#AryanSavsani #IndiaU19 #TanmayBaloda pic.twitter.com/BCSyik4KER
— ANI Digital (@ani_digital) September 8, 2026
శ్రీలంక పర్యటన సమయంలో రోహిత్ సమర్పించిన వయసు ధ్రువీకరణ పత్రాల్లో పుట్టిన సంవత్సరం వేర్వేరుగా ఉంది. ఒకదాంట్లో రోహిత్ 2007లో జన్మించినట్టు ఉండగా.. ఆధార్ కార్డులో మాత్రం 2009లో రోహిత్ పుట్టినట్టు ఉంది. ఇదివరకే ఈ విషయం తెలిసిన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ రోహిత్‌ను జూనియర్ స్థాయిలో ఆడనివ్వలేదు. ఇప్పుడు బీసీసీఐ కూడా అతడి పుట్టిన సంవత్సరంలో తేడాలు ఉండడాన్ని తీవ్రంగా పరిగణించింది. అతడు తన వయసును దాచేందుకు ప్రయత్నించాడని నిర్ధారించుకున్న భారత బోర్డు రెండేళ్లు సస్పెండ్ చేసింది.
🚨 𝗨𝗣𝗗𝗔𝗧𝗘 🚨
Aryan Savsani & Tanmay Baloda added to India U19 squads for Australia U19 fixtures.
Details 🔽https://t.co/sDGpWtgBhs
— BCCI (@BCCI) September 8, 2026
భారత అండర్-19 (వన్డే సిరీస్) స్క్వాడ్ : లక్ష్య రాయ్‌చందని(కెప్టెన్), యశ్‌బర్దన్ చౌహన్(వైస్ కెప్టెన్), రజత్ బఘేల్(వికెట్ కీపర్), ఆర్యవీర్ సెహ్వాగ్, వీ.కే. వినీత్, కుషగ్ర ఓఘా, అర్జున్ రాజ్‌పుత్, మానల్ చౌహన్, అన్వయ్ ద్రవిడ్(వికెట్ కీపర్), వి.యశ్వీర్ యాదవ్, శవిన్ వినోద్, మోహిత్ ఉల్వ, చిగురుపాటి వెంకటక, కావ్య పటేల్, ఆర్యన్ సవ్సానీ.
భారత అండర్-19 (మల్టీ డే) స్క్వాడ్ : యశ్‌బర్దన్ చౌహన్(కెప్టెన్), లక్ష్య రాయ్‌చందని(వైస్ కెప్టెన్), కుషగ్ర ఓఝా, మనాల్ చౌహన్, కుశ్ పటేల్, మానవ్ కృష్ణ(వికెట్ కీపర్), అభిప్రాయ్ బిస్వాస్(వికెట్ కీపర్), ఇషాన్ ఓం, అయాన్ అక్రమ్, ప్రణవ్ రఘవేంద్ర, ప్రియాన్ష్ సింగ్, మోహిత్ ఉల్వా, అర్యన్ యాదవ్, తన్మయ్ బలోడా.