లక్నో, అహ్మదాబాద్ కేంద్రాలుగా.. ఐపీఎల్లో రెండు కొత్త జట్లు

దుబాయ్: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో పాల్గొనే రెండు కొత్త జట్లు ఖరారయ్యాయి. అహ్మదాబాద్, లక్నో వేదికలుగా రెండు ఫ్రాంచైజీలు ఐపీఎల్-15వ సీజన్ నుంచి మెగాలీగ్‌లో భాగం కానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ సోమవారం రెండు జట్ల వివరాలను వెల్లడించింది. లక్నో జట్టును ఆర్పీ- సంజీవ్ గోయెంకా గ్రూప్ రూ. 7090 కోట్లకు దక్కించుకోగా.. అహ్మదాబాద్ కోసం ఐరిలియా కంపెనీ (సీవీసీ క్యాపిటల్) రూ. 5,600 కోట్లు వెచ్చించింది. రెండు జట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఆశించిన బీసీసీఐకి.. ఈ బిడ్ల ద్వారా రూ. 12,715 కోట్ల ఆదాయం సమకూరింది. కొత్త జట్ల రాకను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆహ్వానించాడు. ‘ఐపీఎల్ మరో రెండు కొత్త నగరాలకు చేరనుంది. వచ్చే సీజన్ నుంచి లక్నో, అహ్మదాబాద్ మెగాలీగ్‌లో భాగం కానున్నాయి. బిడ్లకు మంచి స్పందన వచ్చింది’ అని గంగూలీ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది భారత్‌లోనే ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుండగా.. 10 జట్ల మధ్య 74 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ‘ఐపీఎల్‌లోకి తిరిగి రావడం ఆనందంగా ఉంది. ఇది తొలి అడుగు మాత్రమే. మంచి జట్టును ఎంపిక చేయడంతో పాటు లీగ్‌పై మాదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తాం’ అని సంజీవ్ గోయెంక పేర్కొన్నారు. గతంలో గోయెంక రైజింగ్ పుణే జట్టును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- ipl
- IPL New Franchises
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

