South Afirca Sqaud | భారత పర్యటనకు బవుమా.. సఫారీల టెస్టు స్క్వాడ్ ఇదే..!
South Afirca Sqaud : దక్షిణాఫ్రికా టెస్టు సారథి తెంబా బవుమా మళ్లీ జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా దూరమైన అతడు.. భారత పర్యటనతో పునరాగమనం చేయనున్నాడు.
South Afirca Sqaud : దక్షిణాఫ్రికా టెస్టు సారథి తెంబా బవుమా మళ్లీ జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా దూరమైన అతడు.. భారత పర్యటనతో పునరాగమనం చేయనున్నాడు. నవంబర్‌లో టీమిండియాతో రెండు టెస్టుల సిరీస్ నేపథ్యంలో సోమవారం సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. బవుమా కెప్టెన్‌గా 15 మందితో కూడిన పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేశారు. ఇటీవల పాకిస్థాన్ పర్యటనలో అదరగొట్టిన వారికి అవకాశమివ్వాలని సెలెక్టర్లు భావించడంతో.. మిస్టరీ స్పిన్నర్ హార్మర్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు.
‘పాకిస్థాన్‌తో సిరీస్ డ్రా చేసుకోవడంలో కుర్రాళ్లు కీలక పాత్ర పోషించారు. అందుకే వాళ్లకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. భారత్‌లోనూ పాక్ తరహా పిచ్‌లు, వాతావరణ పరిస్థితులే ఉంటాయి కాబట్టి వారిని కొనసాగించడం సరైందనిపించింది’ అని హెడ్‌కోచ్ షుక్రి కొన్రాడ్ వెల్లడించాడు. నవంబర్ 14 ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్ ఆడుతాయి. అనంతరం 22న గువాహటిలో రెండో టెస్టు జరుగుతుంది.
🚨 SQUAD ANNOUNCEMENT 🚨
The South African Men’s selection panel has announced the 15-player squad for the two-match Test series against India from 14 – 26 November in the subcontinent.
Test captain Temba Bavuma returns to the side after missing the recent Pakistan Test series… pic.twitter.com/dOGTELaXUu
— Proteas Men (@ProteasMenCSA) October 27, 2025
సుదీర్ఘ ఫార్మాట్లో సంచలన విజయాలతో టెస్టు గదను సొంతం చేసుకుంది దక్షిణాఫ్రికా. ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేసుకుంటూ తొలిసారి డబ్ల్యూటీసీ విజేతగా అవతరించింది. లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాను కంగుతినిపించింది బవుమా సారత్యంలోని సఫారీ టీమ్. కానీ, ఆ తర్వాత తొలి పర్యటనలోనే ఆ జట్టుకు పాకిస్థాన్ షాకిచ్చింది.
రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమితో దక్షిణాఫ్రికా జైత్రయాత్రకు చెక్ పెట్టింది పాక్.. అయితే.. నిర్ణయాత్మక రెండో మ్యాచ్‌లో గొప్పగా ఆడిన సఫారీ కుర్రాళ్లు.. ఆతిథ్య జట్టుకు షాకిచ్చారు. దాంతో. 1-1తో సిరీస్ పంచుకుంది సఫారీ టీమ్. ఇప్పుడు భారత పర్యటనలోనూ గొప్పగా ఆడాలని బవుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికాపట్టుదలతో ఉంది. అయితే.. స్వదేశంలో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన శుభ్‌మన్ గిల్ సేన డబ్ల్యూటీసీ ఛాంపియన్‌కు దడ పుట్టించాలనే కసితో ఉంది. ఇరుజట్లకు ఇది కీలకమైన సిరీస్ కావడంతో ఉత్కంఠ పోరాటాలు అభిమానులను అలరించడం ఖాయం.
దక్షిణాఫ్రికా స్క్వాడ్ : తెంబా బవుమా(కెప్టెన్), కార్బిన్ బాస్చ్, డెవాల్డ్ బ్రెవిస్, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైలీ వెర్రనే, టోనీ డీజోర్జి, జుబయర్ హంజా, సిమన్ హార్మర్, మార్కో యాన్సెస్, కేశవ్ మహరాజ్, ఎడెన్ మర్క్రమ్, వియాన్ మల్డర్, సెనురన్ ముత్తుస్వామి, కగిసో రబడ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

