BAN vs SL: సెంచరీతో లంకను ఆదుకున్న అసలంక.. బంగ్లా టార్గెట్ ఎంతంటే..!
BAN vs SL: లంక మిడిలార్డర్ బ్యాటర్ చరిత్ అసలంక సెంచరీతో పాటు సదీర సమరవిక్రమ, ఓపెనర్ పతుమ్ నిస్సంక రాణిచండంతో బంగ్లాదేశ్ తో ఢిల్లీలో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక పోరాడే లక్ష్యాన్ని నిలిపింది.
BAN vs SL: వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంక – బంగ్లాదేశ్ మధ్య ఢిల్లీ వేదికగా జరుగుతున్న 38వ లీగ్ మ్యాచ్‌లో లంక మిడిలార్డర్ బ్యాటర్ చరిత్ అసలంక (105 బంతుల్లో 108, 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో మెరిశాడు. అసలంకతో పాటు సదీర సమరవిక్రమ (42 బంతుల్లో 41, 4 ఫోర్లు), ఓపెనర్ పతుమ్ నిస్సంక (36 బంతుల్లో 41, 8 ఫోర్లు) రాణిచండంతో లంకేయులు 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్ అయి ప్రత్యర్థి ఎదుట పోరాడగలిగే లక్ష్యాన్ని నిలిపారు.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన లంక.. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కుశాల్ పెరీరా (4)ను షోరిఫుల్ ఇస్లాం ఔట్ చేసి లంకకు తొలి షాకిచ్చాడు. రెండో వికెట్‌కు నిస్సంక.. కెప్టెన్ కుశాల్ మెండిస్ (19)తో కలిసి 61 పరుగులు జోడించాడు. కానీ ఆరు పరుగుల వ్యవధిలో లంక రెండు వికెట్లు కోల్పోయింది. మెండిస్‌ను షకిబ్ ఔట్ చేయగా నిస్సంకను తాంజిబ్ హసన్ సకిబ్ బౌల్డ్ చేశాడు. అనంతరం సమరవిక్రమ – అసలంకలు కలిసి నాలుగో వికెట్‌కు 63 పరుగులు జోడించారు.
మాథ్యూస్ టైమ్డ్ జౌట్..
నిలకడగా ఆడుతున్న లంక ఇన్నింగ్స్‌లో షకిబ్ భారీ కుదుపుతెచ్చాడు. సమరవిక్రమను 25వ ఓవర్లో రెండో బంతికి షకిబ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చినా రెండు నిమిషాల లోపు బంతిని ఎదుర్కోకపోవడంతో వెటరన్ బ్యాటర్ ఏంజెలొ మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ కింద పెవిలియన్ చేరాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోయినా అసలంక.. ధనంజయ డిసిల్వ (36 బంతుల్లో 34, 4 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి లంక ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 78 పరుగులు జతచేశారు.
అసలంక శతకం..
ధనంజయ నిష్క్రమించాక వచ్చిన మహీశ్ తీక్షణ (31 బంతుల్లో 22, 3 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా పట్టుదలగా క్రీజులో నిలబడ్డ అసలంక.. షోరిఫుల్ ఇస్లాం వేసిన 48వ ఓవర్లో ఐదో బంతికి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తిచేసుకున్నాడు. తాంజిమ్ వేసిన మరుసటి ఓవర్లో అసలంక.. ఓ భారీ సిక్సర్ బాదినా నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి లిటన్ దాస్ చేతికి చిక్కాడు. బంగ్లా బౌలర్లలో తాంజిమ్ హసన్‌ను మూడు వికెట్లు దక్కగా షకిబ్, షోరిఫుల్ ఇస్లాంలకు తలా రెండు వికెట్లు దక్కాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

