KKR vs RR : ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆదిలోనే షాక్. గత మ్యాచ్ హీరో ఫిలిప్ సాల్ట్(10) ఔటయ్యాడు. అవేశ్ ఖాన్ ఓవర్లో అతడికే క్యాచ్ ఇచ్చాడు. బంతిని గమనించిన అవేశ్ ఎడమ వైపు డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 21 పరుగుల వద్ద కోల్‌కతా మొదటి వికెట్ పడింది. యువకెరటం అంగ్క్రిష్ రఘువంశీ క్రీజులోకి వచ్చాడు. సునీల్ నరైన్ 11 పరుగులతో ఆడుతున్నాడు. నాలుగు ఓవర్లకు స్కోర్.. 26/1 .
𝗦𝘂𝗽𝗲𝗿𝗯 𝗥𝗲𝗳𝗹𝗲𝘅𝗲𝘀 😯
Avesh Khan makes the early inroads with a brilliant caught & bowled 👌👌
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/uUWmsVSuLw
— IndianPremierLeague (@IPL) April 16, 2024
టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సంజూ సేన ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగింది. సమఉజ్జీల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో మరికాసేపట్లో తేలనుంది.