IPL 2023 | డూప్లెసిస్‌కు ఫైన్.. అవేశ్ ఖాన్‌పై చర్యలకు సిద్ధమైన బీసీసీఐ
IPL 2023 : లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) పేసర్ అవేశ్ ఖాన్(Avesh Khan)పై బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది. కారణం ఏంటంటే.. అతను ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 ఉల్లంఘనకు పాల్పడ్డాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)పై ఆఖరి బంతికి సింగిల్ తీసి లక్నోను గెలిపించిన అతను హెల్మెట్‌ను నేలకేసి కొట్టి సంబురాలు చేసుకున్నాడు. స్లో ఓవర్ రేటు కారణంగా మ్యాచ్ రెఫరీ డూప్లెసిస్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు.
IPL 2023 : లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) పేసర్ అవేశ్ ఖాన్(Avesh Khan)పై బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది. కారణం ఏంటంటే.. అతను ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 ఉల్లంఘనకు పాల్పడ్డాడు. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)పై ఆఖరి బంతికి సింగిల్ తీసి లక్నోను గెలిపించిన అతను ఉద్రేకాన్ని నియంత్రించుకోలేక పోయాడు. ఆవేశంగా హెల్మెట్‌ను నేలకేసి కొట్టి సంబురాలు చేసుకున్నాడు.
అతడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ చర్యలు తీసుకోనుంది. అవేశ్ ఖాన్ కూడా తన నేరాన్ని అంగీకరించాడు. అయితే.. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? అనేది మ్యాచ్ రిఫరీ నిర్ణయంపై ఆధారపడి ఉంది.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win!
A roller-coaster of emotions in Bengaluru 🔥🔥
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT
— IndianPremierLeague (@IPL) April 10, 2023
స్లో ఓవర్ రేటు..
ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఓడిపోయిన ఆర్సీబీకి మరో షాక్. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్( Faf du Plessis) జరిమానాకు గురయ్యాడు. స్లో ఓవర్ రేటు కారణంగా మ్యాచ్ రెఫరీ అతడికి రూ.12 లక్షల జరిమానా విధించారు. ఆఖరి బంతి వరకు విజయం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 212 రన్స్ కొట్టింది. విరాట్ కోహ్లీ(61), డూప్లెసిస్(79), మ్యాక్స్‌వెల్(59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారీ లక్ష్య ఛేదనలో లక్నో బ్యాటర్లు దంచి కొట్టారు. మార్కస్ స్టోయినిస్(65), నికోలస్ పూరన్ (62) సిక్స్‌లతో ఆర్సీబీ బౌలర్లను హడలెత్తించారు. ఆఖరి ఓవర్లో ఉత్కంఠ నెలకొంది. హర్షల్ పటేల్ మన్కడింగ్‌కు ప్రయత్నించి విఫలం అయ్యాడు. అవేశ్ ఖాన్ సింగిల్ తీయడంతో లక్నో టీమ్ సంబురాలు చేసుకుంది.
ఇవి కూడా చదవండి
ODI WC 2023 | వరల్డ్ కప్ ఏర్పాట్లు షురూ.. రూ.502 కోట్లతో ఐదు ప్రధాన స్టేడియాలకు కొత్త కళ
Lucknow Super Giants: థ్రిల్లర్‌లో నెగ్గిన లక్నో.. లాస్ట్ బాల్ డ్రామా చూడాల్సిందే.. వీడియో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

