పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని చాలామంది నిరూపిస్తూనే ఉంటారు. అలాంలి వారిలో అవనీ లేఖరా కూడా ఉంటుంది. ఈ పారాలింపిక్ షూటర్.. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి అందరి మన్ననలు పొందింది. ఈ 20 ఏళ్ల షూటర్.. ఇప్పుడు తాజాగా రెండు విభాగాల్లో ప్రపంచ నెంబర్ వన్‌గా అవతరించింది. ఆర్2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 విభాగంతోపాటు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఎస్‌హెచ్1 విభాగాల్లో ప్రపంచ నెంబర్‌వన్‌గా అవని లేఖరా అవతరించింది.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఆమె తను చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొంది. ‘‘ఇంత అచీవ్మెంట్ సాధించడం చూస్తే మరింత మోటివేట్ అవుతున్నా’’ అని ఆమె ట్వీట్ చేసింది. ఈ క్రమంలో అవనికి ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.
Very happy to have achieved the Number 1 World Ranking in both the R2 – 10M Air Rifle Women’s SH1 and R8 – 50M Rifle 3 Positions Women’s events. Immensely motivated by this achievement! 🥇 pic.twitter.com/99PwnMEEaV
— Avani Lekhara अवनी लेखरा PLY (@AvaniLekhara) June 28, 2022