Todd Murphy: ఆసీస్ కొత్త హీరో టాడ్ మర్ఫి..
Todd Murphy: ఫస్ట్ టెస్టులోనే 5 వికెట్లు తీసుకున్నాడు మర్ఫి. ఆసీస్‌కు కొత్త హీరోలా అవతరలించాడు. స్పిన్ ఈజీగా ఆడే ఇండియన్లను నాగపూర్ పిచ్‌పై ఖంగుతినిపించాడు.
నాగపూర్: టాడ్ మర్ఫి.. ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టులో కొత్త హీరో. రైట్ ఆర్మ్ స్పిన్నర్ మర్ఫి.. ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే 5 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే గతంలో ఆస్ట్రేలియాకు చెందిన మరో స్పిన్నర్ లియాన్ కూడా తన అరంగేట్రం టెస్టులో అయిదు వికెట్లు తీసుకున్నాడు. 2011లో గాలేలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నాథన్ లియాన్ ఆ ఫీట్ అందుకున్నాడు.
A debut to remember for Todd Murphy🤩#INDvAUS pic.twitter.com/cWghFuuWDH
— cricket.com.au (@cricketcomau) February 10, 2023
ఇవాళ మర్ఫి బౌలింగ్ చేసిన తీరు ప్రత్యేకమైంది. ఇండియన్ బ్యాటింగ్ లైనప్‌కు మర్ఫి చాలా చాకచక్యంగా బౌల్ చేశాడు. వత్తిడిలో ఉన్న ఆసీస్‌కు సరైన సమయంలో కొత్త స్పిన్నర్ దొరికినట్లు అయ్యింది. నిజానికి ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ చాలా స్వల్ప స్కోర్ చేసింది. ఆ టెన్షన్లో ఉన్న ఆస్ట్రేలియా.. వికెట్లే లక్ష్యంగా బౌలింగ్ చేసింది. అయితే మర్ఫి తన బౌలింగ్ అటాక్‌తో కీలక దశల్లో వికెట్లను పడగొట్టేశాడు.
Australia's new hero 🤩#INDvAUS pic.twitter.com/fZvZIejvUY
— cricket.com.au (@cricketcomau) February 10, 2023
22 ఏళ్ల మర్ఫి.. ఆస్ట్రేలియాకు ఆడుతున్న తొలి టెస్టు ఇదే. అతను ఇప్పటి వరకు కేవలం 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వాస్తవానికి నాగపూర్ పిచ్‌లో ఉన్న కండీషన్స్ మర్ఫికి అనుకూలంగా ఉన్నా.. మ్యాచ్ సిచ్యువేషన్ అలా లేదు. స్పిన్నర్ల అలవోకగా ఆడే ఇండియన్ లైనప్‌లో మేటి బ్యాటర్లను మర్ఫి ఔట్ చేయడం గమనార్హం. కేఎల్ రాహుల్, అశ్విన్, పూజారా, భరత్, కోహ్లీ వికెట్లను తీసుకున్నాడతను.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

